సింహాచలంలోని వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ మేరకు ఆలయ ఈవోకు దేవాదాయశాఖ ఆదేశాలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పట్టు వస్త్రాల కొనుగోలు కోసం రూ.10 వేలు వెచ్చించాల్సిందిగా ప్రభుత్వం సూచించింది. ఈ నెల 26న జరుగనున్న స్వామివారి నిజరూప దర్శన కార్యక్రమానికి... ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ హాజరు కావొచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఛైర్మన్ కుటుంబ సభ్యులు ఎవరూ లేకుండా మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరు కావాలని జీవోలో పేర్కోంది. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రజలతో పాటు వీఐపీలను ఎవరినీ ఆహ్వానించొద్దని తేల్చి చెప్పింది. చందనోత్సవ కార్యక్రమాన్ని ప్రజల కోసం యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయొచ్చని తెలిపింది. అయితే అంతరాలయంలోని మూలవిరాట్ను చిత్రీకరించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొంది.
సింహాద్రి అప్పన్నకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు - simhachalam Laxminarasimha Swamy temple latest news in telugu
సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించాల్సిందిగా ఆలయ ఈవోను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రజల కోసం చందనోత్సవ కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయొచ్చని సూచించింది.
సింహాచలంలోని వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ మేరకు ఆలయ ఈవోకు దేవాదాయశాఖ ఆదేశాలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పట్టు వస్త్రాల కొనుగోలు కోసం రూ.10 వేలు వెచ్చించాల్సిందిగా ప్రభుత్వం సూచించింది. ఈ నెల 26న జరుగనున్న స్వామివారి నిజరూప దర్శన కార్యక్రమానికి... ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ హాజరు కావొచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఛైర్మన్ కుటుంబ సభ్యులు ఎవరూ లేకుండా మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరు కావాలని జీవోలో పేర్కోంది. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రజలతో పాటు వీఐపీలను ఎవరినీ ఆహ్వానించొద్దని తేల్చి చెప్పింది. చందనోత్సవ కార్యక్రమాన్ని ప్రజల కోసం యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయొచ్చని తెలిపింది. అయితే అంతరాలయంలోని మూలవిరాట్ను చిత్రీకరించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొంది.
ఇదీ చూడండి: సింహాచలంలో చందనం అరగదీత ప్రారంభం