సింహాచలం కొండపైకి వెళ్లే రహదారి ఇరుకుగా ఉండటం వల్ల ఒకేసారి ఎక్కువ వాహనాలు వెళ్లడం కష్టంగా మారింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు వాహన రాకపోకలకు వేరువేరు రహదారులు నిర్మిస్తున్నారు. ఆదాయ ఆర్జనలో తిరుపతి తర్వాతి స్థానంలో ఉన్న సింహాచలం దేవస్థానం.. భక్తుల రాకపోకలకు అనుగుణంగా పలు అభివృద్ధి పనులు చేపట్టింది.
తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తుంటారు. నేరుగా కొండపైకి వాహన రాకపోకలు సాగేలా రహదారి, విద్యుత్ దీపాలు ఏర్పాట్లు చేస్తోంది దేవస్థానం. లాక్డౌన్ కారణంగా దర్శనాలు నిలిపివేయటంతో... పనులకు ఆటంకం లేకుండా వేగంగా జరుగుతున్నాయి. కనీసం గిరి ప్రదక్షిణ సమయానికి విస్తరణ పనులు పూర్తి చేసేందుకు సింహాచల దేవస్థానం ప్రణాళికబద్ధంగా పని చేస్తోంది.
ఇదీ చదవండి : ఎస్ఈసీ నియామకంలో ప్రభుత్వం ఏం చేసింది..?