ETV Bharat / city

నాటుసారా స్థావరాలపై సెబ్ దాడులు.. కేసులు నమోదు

author img

By

Published : May 25, 2021, 4:43 PM IST

కొందరు అక్రమార్కులు అమాయక కూలీలను పావులుగా వాడుకొని.. నాటుసారా స్థావరాలు పుట్టగొడుగుల్లా ఏర్పాటు చేస్తున్నారు. ఒక పక్క ఆబ్కారీ శాఖ, మరోవైపు పోలీసులు దాడులు చేస్తున్నా.. నాటుసారా తయారీ తగ్గుముఖం పట్టలేదు. మద్యం ధరలు పెరగటం.. కరోనా వైరస్ ప్రభావంతో పేద ప్రజల ఆదాయాలు తగ్గిపోవటంతో తక్కువ ధరకు లభించే నాటుసారా తాగడానికి గ్రామీణులు ఆసక్తి చూపుతున్నారు. ఈ అవకాశాన్ని సారా తయారీదారులు ఆసరాగా మార్చుకుంటున్నారు.

SEB officers raids
నాటుసారా బట్టిలపై సెబ్ అధికారులు దాడులు

ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం బొమ్మి లింగం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో నాటుసారా బట్టీలపై ఎస్​ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. నాటు సారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన 1600 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. నాటుసారాను తయారు చేయటం, అమ్మటం నేరమని అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్​ఈబీ అధికారులు హెచ్చరించారు. ఈ దాడుల్లో సెబ్ అధికారులు ఎస్ఐ నగేష్, సిబ్బంది నాగూర్, శ్రీపతి, సుబ్బరాయుడు. పాల్గొన్నారు.

ఏరులై పారుతున్న నాటుసారా.. పుట్టగొడుగుల్లా స్థావరాలు..

విశాఖ జిల్లాలోని మాడుగుల నియోజకవర్గంలో మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు మండలాల్లోని నాటుసారా ఎక్కువ మొత్తంలో తయారవుతోంది. మద్యం ధరలు పెరగటం.. కరోనా ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఆదాయాలు తగ్గడంతో.. తక్కువ ధరకు లభించే నాటుసారా వైపు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో అక్రమార్కులకు నాటుసారా తయారీ కుటీర పరిశ్రమగా మారిపోయింది. సారా తయారీ దారులకు కొందరు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

2 వేల లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం..

విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నాటుసారా స్థావరాలపై అధికారులు దాడులు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లపు ఊట, సారా పట్టుబడుతోంది. దేవరాపల్లి మండలం బొడ్డపాడు, ముకందపురం ప్రాంతాల్లో నాటుసారా తయారు చేస్తున్నట్లు అందిన సమాచారంతో.. పోలీసులు దాడులు నిర్వహించారు. 2వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. సారా తయారీ సామాగ్రి, ప్లాస్టిక్ డ్రమ్ములను కాల్చివేశారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సింహాచలం తెలిపారు.

నిందితులు పరారీ..

అనంతపురం జిల్లా కదిరి మండలం మరవకుండా సమీపంలోని అటవీ ప్రాంతంలో నాటు సారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. కదిరి గ్రామీణ సీఐ నిరంజన్ రెడ్డి సిబ్బందితో కలిసి దాడుల్లో పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న నాటు సారా తయారీదారులు పరారయ్యారు. నాటుసారా స్థావరాలను ధ్వంసం చేసిన పోలీసులు 2 వేల లీటర్ల బెల్లం ఊటను, ఇతర సామగ్రిని దగ్ధం చేశారు. 20 లీటర్ల సారాను స్వాధీనం చేసుకొని నిందితులపై కేసు నమోదు చేశారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తామని సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.

నాటుసారా తయారీ చేసినా.. విక్రయించినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నాటుసారాను అరికట్టేందుకు ప్రతిరోజూ దాడులు చేస్తున్నామన్నారు. నాటుసారా పూర్తిగా అరికట్టడానికి ప్రజలు, ప్రజాప్రతినిధుల సహకారాన్ని అందించాలని వారు కోరారు.

ఇవీ చూడండి..

35 వేల వాహనాలను స్వాధీనం చేసుకున్నాం: విజయవాడ సీపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.