ETV Bharat / city

విశాఖలో నిరాడంబరంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు - Visakhapatnam Congress latest news

దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకను విశాఖలో నిరాడంబరంగా నిర్వహించారు. నగర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునందాదేవి.. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

Rajiv Gandhi death anniversary at Visakhapatnam

author img

By

Published : May 21, 2021, 4:10 PM IST

విశాఖ నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో దివంగత రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకను నిరాడంబరంగా నిర్వహించారు. నగర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునందాదేవి ఆధ్వర్యంలో.. పార్టీ కార్యాలయం నుంచి నేతలు, కార్యకర్తలు జగదాంబ జంక్షన్​లోని రాజీవ్ గాంధీ విగ్రహం వరకు పాదయాత్రగా వెళ్లి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. దేశానికి సాంకేతికతను పరిచయం చేసిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని సునందాదేవి అన్నారు.

అంతకుముందు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సంకు వెంకటేశ్వరరావు చేసిన ఆర్థిక సాయంతో పేదలకు మాస్కులు, శానిటైజెర్లు, మహిళలకు పండ్లు పంపిణీ చేశారు. పార్టీ ఆదేశాల మేరకు వేడుకను నిరాడంబరంగా నిర్వహించినట్లు ఆమె తెలిపారు.

ఇదీ చూదవండి..కొరత తీర్చేందుకు..మొబైల్ ఆక్సిజన్ ప్లాంట్ ఆన్ వీల్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.