ETV Bharat / city

Visakha Railway Zone: విశాఖ రైల్వే జోన్‌ ఎప్పటి నుంచో చెప్పలేం: రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్‌

author img

By

Published : Jul 24, 2021, 10:40 AM IST

విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా కొత్త రైల్వేజోన్‌ ఎప్పటినుంచి ప్రారంభం అవుతుందో అప్పుడే చెప్పలేమని రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్‌ స్పష్టం చేశారు. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్నాకే సరిహద్దులపై నిర్ణయం తీసుకుంటామని రాజ్యసభలో తెదేపా సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

railway minister on visakha zone
రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్‌

విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ ఎప్పటినుంచి ప్రారంభం అవుతుందో చెప్పలేమని రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్‌ స్పష్టం చేశారు. శుక్రవారం రాజ్యసభలో తెదేపా సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ఇంకా ప్రారంభం కాలేదన్న విషయం ప్రభుత్వానికి తెలుసన్నారు. ఈ జోన్‌పై ప్రత్యేక అధికారి సమర్పించిన సవివర నివేదిక(డీపీఆర్‌) పరిశీలనలో ఉన్నందున ఎప్పటినుంచి ప్రారంభమవుతుందో కచ్చితమైన సమయం చెప్పలేమన్నారు.

వాల్తేర్‌ డివిజన్‌ను కొత్త జోన్‌లో కొనసాగించే అంశంపై కనకమేడల అడిగిన ప్రశ్నకు మంత్రి స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. వాల్తేర్‌ డివిజన్‌ను దక్షిణకోస్తా జోన్‌లోనే కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ఎంపీలు, ఎమ్మెల్సీలు తదితరుల నుంచి వినతులు అందాయన్నారు. అయితే కొత్త దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు, దాని భౌగోళిక పరిధిపై పరిపాలన, నిర్వహణ అవసరాలతోపాటు ఇతరత్రా అన్ని అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే రైల్వేశాఖ నిర్ణయం తీసుకొందని రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్‌ పేర్కొన్నారు.

భద్రక్‌ - విజయనగరం మధ్య మూడోలైన్‌ను మంజూరు చేయడంలేదని ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ ప్రాజెక్టును 2015-16 రైల్వే బడ్జెట్‌లో చేర్చారని, డీపీఆర్‌ ప్రకారం 385 కిలోమీటర్ల పనికి రూ.3,823 కోట్లు ఖర్చవుతుందని తేలిందని అశ్వినీవైష్ణవ్‌ తెలిపారు. ఈ కారణంగానే ప్రాజెక్టును మంజూరు చేయలేదన్నారు.

‘సార్వత్రిక టీకా’పై కొవిడ్‌ ప్రభావం చూపింది: కేంద్ర మంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌

పిల్లలకు ఇచ్చే సార్వత్రిక టీకా కార్యక్రమంపై కొవిడ్‌ కొంత ప్రభావం చూపినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయమంత్రి భారతీ ప్రవీణ్‌ పవార్‌ తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో ఈ టీకా తగ్గినట్లు సమాచారం అందిందని పేర్కొన్నారు. శుక్రవారం లోక్‌సభలో ఆమె ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

‘కరోనా వ్యాప్తి సమయంలోనూ పిల్లలకు టీకాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ సార్వత్రిక టీకా కార్యక్రమం కింద ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవడం తప్పనిసరేమీ కాదు. దేశవ్యాప్తంగా పిల్లలకు బీసీజీ, పోలియో చుక్కలు, హెపటైటిస్‌ బి, పెంటావలెంట్‌ వంటి ఇతర వ్యాధుల నిరోధానికి వ్యాక్సిన్లు అందించాం’ అని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి చెప్పిన డేటా ప్రకారం గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఏపీలో వ్యాక్సినేషన్‌ పెరిగింది. తెలంగాణలో తగ్గింది.

ఇదీ చదవండి:

రైలు కింద బాలుడు.. చాకచక్యంగా రక్షించారిలా...

మద్యం హోం డెలివరీకి మరో రాష్ట్రం గ్రీన్​సిగ్నల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.