ETV Bharat / city

Centre on Visakha Railway Zone: రైల్వే జోన్​పై స్పష్టత కోరిన ఎంపీ కనకమేడల.. స్పందించిన కేంద్రమంత్రి

Centre on Visakha Railway Zone: విశాఖ రైల్వే జోన్ పై స్పష్టతనివ్వాలని ఎంపీ కనకమేడల లేవనెత్తిన అంశంపై కేంద్రం స్పందించింది. విభజన హామీలన్నీ అమలు చేస్తామని స్పష్టం చేసింది. కానీ ప్రత్యేకంగా విశాఖ రైల్వే జోన్ అంశంపై బదులివ్వలేదు.

Centre on Vishaka Railway Zone
Centre on Vishaka Railway Zone
author img

By

Published : Dec 10, 2021, 1:44 PM IST

Centre on Visakha Railway Zone: విశాఖ రైల్వేజోన్‌పై లోక్​సభలో ఇటీవల కేంద్రం చేసిన ప్రకటనపై ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్​ స్పష్టత కోరారు. రైల్వేజోన్‌పై కేంద్రం ప్రకటనలు ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు. కనకమేడల లేవనెత్తిన విషయంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ స్పందించారు. విభజన హామీలన్నీ అమలు చేస్తామన్న మంత్రి.. రైల్వే జోన్​ అంశంపై ప్రత్యేకంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.

రాష్ట్రాలు సహకరిస్తేనే ప్రాజెక్టులు త్వరగా పూర్తవుతాయి: కేంద్రం

centre on chennai bangalore industrial corridor: చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌పై రాజ్యసభలో కేంద్రం సమాధానం ఇచ్చింది. ఎంపీలు జీవీఎల్‌, కనకమేడల ప్రశ్నలకు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్ బదులిచ్చారు. కృష్ణపట్నం నోడ్‌ కింద 2,500 ఎకరాలు సేకరించాలని పేర్కొన్న మంత్రి.. ఇందుకోసం 2,091 ఎకరాలు సేకరించారని వెల్లడించారు. పనులు జరగాలంటే గుత్తేదారు నియామకం అవసరమన్నారు. గుత్తేదారు నియామకం రాష్ట్ర ప్రభుత్వం విధి అని గుర్తు చేశారు.

టెండర్‌ ద్వారానే గుత్తేదారు నియామకం జరగాలన్నారు. టెండర్‌ ప్రక్రియలో కేంద్రం ఎక్కడా జోక్యం చేసుకోవట్లేదని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఓర్వకల్లు నోడ్‌కు 9,800 ఎకరాలు సేకరించాలని.. ఇందుకోసం ఏపీ 4,500 ఎకరాలు మాత్రం ఇస్తోందన్నారు. కీలక ప్రాజెక్టుల్లో రాష్ట్రాల సహకారం ప్రధానమన్న ఆయన.. సహకరిస్తేనే ప్రాజెక్టులు త్వరగా పూర్తవుతాయని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

YSRC MP's On RAILWAY ZONE: ఆ ఎంపీ ధన్యవాదాలు చెప్పారు.. మరో ఎంపీ అయోమయం అన్నారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.