పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ కరోనా వస్తుందని మంత్రి అవంతి చెబుతున్నారని.. కానీ విశాఖకు చెందిన విద్యావేత్త నలంద కిశోర్ ప్రభుత్వ తీరు వల్లే చనిపోయారని రఘురామకృష్ణరాజు అన్నారు. నలంద కిశోర్ది ముమ్మాటికీ సాధారణ మరణం కాదని, పోలీస్ లు దుందుడుకుగా కర్నూలు తీసుకెళ్లడం వల్లనే ఆయన చనిపోయారని ఆరోపించారు. మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలను తిప్పికొడుతూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఎక్కువ మంది ప్రజలు విశాఖ కన్నా అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుకుంటున్నారన్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్ మాదిరిగా తాను కేవలం ఒక్కరి ఫొటో వల్లనే గెలవలేదని సొంత చరిష్మా కూడా తోడైందని చెప్పారు. తనపై విమర్శలు చేయడం వలన అవంతి శ్రీనివాస్ మంత్రి పదవి పదిలంగా ఉంటుందని ఆశిస్తున్నాన్నారు.
ఇదీ చదవండి: ఉత్తరాంధ్ర జోలికి వస్తే ఉపేక్షించం: మంత్రి అవంతి శ్రీనివాస్