Puffer Fish: ఇక్కడ తల భాగంలో ముళ్లతో విచిత్రంగా కనిపిస్తున్న సముద్రజీవిని జాలర్లు ముళ్ల కప్ప అంటారు. విశాఖ రుషికొండ సమీప కార్తికవనం వద్ద సముద్రంలో మంగళవారం జాలరుల వలకు చిక్కింది. దీని వ్యవహారిక నామం 'పఫర్ ఫిష్' అని విశాఖలోని మత్స్య శాఖ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ పి.శ్రీనివాసరావు తెలిపారు. చిన్న చేపలు, నాచు తింటూ మనుగడ సాగించే ఈ కప్పలు.. ప్రమాద సమయాల్లో రక్షణ కోసం తల భాగంలోని ముళ్లతో ప్రతిఘటిస్తాయని చెప్పారు. ఇవి ఒక్కోటి రెండు కిలోలకుపైగా బరువు పెరుగుతాయన్నారు.
ఇదీ చదవండి:
"2023 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం... ఆయనకు అంకితమిస్తాం"