విశాఖపట్నంలోని పౌర గ్రంథాలయం....మెదడుకు మేతపెట్టే పుస్తకాలతోనే కాక మనసును ఉల్లాసపరిచే పర్యావరణహిత వాతావరణంతో ఆకట్టుకుంటోంది. చిన్నారుల్ని గ్రంథాలయం వైపు అడుగులు వేయించటమే లక్ష్యంగా గోడలకు పచ్చని చెట్లు, జంతువులతో నిండిన బొమ్మలు అతికించారు. నేలపై పచ్చని బయళ్ల మాదిరిగా గ్రీన్‌మ్యాట్ వేశారు. ఆడుతూ పాడుతూ చదువుకునేందుకు ఊయళ్లు ఏర్పాటు చేశారు. పిల్లలకోసం మియావాకి పేరిట రూపొందించిన ప్రత్యేక విభాగం....పుస్తక పఠనంపై ఆసక్తిని పెంచుతోంది.
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం గ్రంథాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గ్రూపు-1, గ్రూపు-2, ఇతర పరీక్షలకు అవసరమైన పుస్తకాల్ని సబ్జెక్టులు వారీగా విడివిడిగా రీడింగ్ రూమ్‌లో అందుబాటులో ఉంచారు. అన్ని రకాల వసతులతో అత్యంత ప్రశాంత వాతావరణంలో నిరుద్యోగ యువత చదువుకునేలా గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్నారు..
ప్రభుత్వ కొలువులే లక్ష్యంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతకు విశాఖ పౌరగ్రంథాలయం అండగా నిలుస్తోంది. వర్తమాన వ్యవహారాలు, జనరల్ నాలెడ్జ్, చరిత్ర, పాలిటీ, ఏకానమీ వంటి దాదాపు 50 వేలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉండటం వల్ల పరిసర ప్రాంతాల అభ్యర్థులు....ఈ గ్రంథాలయాన్ని వినియోగించుకుంటున్నారు. పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మియావాకికి సైతం అద్భుత స్పందన వస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు.
నెలకోసారి క్విజ్, వ్యక్తిత్వ వికాస పోటీల నిర్వహణతో పాఠకుల్ని ఆకట్టుకుంటున్న విశాఖ పౌర గ్రంథాలయం....పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణంతో ప్రత్యేక చాటుకుంటోంది.
ఇదీ చదవండి : దేశప్రజలకు ఊరట.. భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు
విజయ్ దేవరకొండతో రొమాంటిక్ మూవీ చేయాలనుంది: నటి