తమ బిడ్డ క్షేమంగా ఇంటికి రావడానికి భారత ప్రభుత్వం చాలా సహాయం చేసిందని... ప్రశాంత్ తండ్రి బాబూరావు ఆనందం వ్యక్తం చేశారు. ప్రశాంత్ వస్తాడో రాడో అనే బెంగతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపినట్టు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వల్లే ప్రశాంత్‌ను చూసినట్టు చెప్పారు. అపార్ట్మెంట్ వాసులు అందరూ మా అబ్బాయి తిరిగి రావడానికి చాలా సహాయం చేసారని బాబూరావు చెప్పారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో పాటు సహాయత స్వచ్ఛంద సంస్థ ఎంతో సహకారం అందించిందని స్పష్టం చేశారు.
తన తల్లిదండ్రులను కలుస్తానని అస్సలు అనుకోలేదని, భారత ప్రభుత్వం సహాయం చేయబట్టే తాను ఇంత వేగంగా ఇంటికి చేరుకోగలిగానని ప్రశాంత్ సంతోషం వ్యక్తం చేశారు. తనలాగే వెళ్లి పాక్‌లో చాలా మంది ఉన్నారని... అక్కడున్న భారతీయుల పేర్లను ప్రభుత్వానికి ఇచ్చానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మిగతావారిని కూడా తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కొంతమందికి శిక్ష పూర్తయినా... ఇంకా ఎంబసీలో క్లియరెన్సీ కోసం వేచి చూస్తున్నారని వెల్లడించారు.
భారత్-పాక్ బార్డర్లో తనని ఎవరూ పట్టుకోలేదని, సరిహద్దు దాటి నడుచుకుంటూ వెళ్తుంటే హైవే పెట్రోలింగ్ వాహనం వాళ్లు రెండో రోజు పట్టుకున్నట్టు ప్రశాంత్ వివరించారు. పాక్‌లోకి ప్రవేశించిన తరవాత... ఎడారిలో 40 కిలోమీటర్లు నడిచినట్టు చెప్పారు. పాకిస్థాన్ భద్రత సిబ్బంది తనపై మానవత్వం చూపించారని, జైల్లో ఏ భారత ఖైదీలతో పనులు చేయనివ్వరని వివరించారు. పాకిస్థాన్‌లో ఉన్న ఖైదీలను ముస్లింలుగా మారమని అడుగుతారని... తాను మతం మారనని శివున్ని ప్రార్థిస్తానని చెపినట్టు ప్రశాంత్ పేర్కొన్నారు. భావల్పూర్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవించినట్టు ప్రశాంత్ చెప్పారు. ఓ మంచి సాప్ట్‌వేర్‌గా స్థిరపడతానని, దానికోసం జైల్లోనే కొన్ని పుస్తకాలు చదివనట్టు ప్రశాంత్ చెప్పారు.
ఇదీ చదవండీ... పాక్ నుంచి హైదరాబాద్‌కు.. అక్కడి నుంచి విశాఖకు ప్రశాంత్