ETV Bharat / city

రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోనే పోస్కో వచ్చింది: దేవినేని ఉమ

author img

By

Published : Feb 15, 2021, 6:58 PM IST

రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోనే పోస్కో వచ్చిందని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. ఆ సంస్థతో మూడు సార్లు వైకాపా నేతలకు విందు భేటీలు జరిగాయన్నారు. అందుకే విశాఖ ఉక్కుపై సీఎం జగన్‌ మాట్లాడటం లేదని ఆక్షేపించారు.

రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోనే పోస్కో వచ్చింది: దేవినేని ఉమ
రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోనే పోస్కో వచ్చింది: దేవినేని ఉమ

విశాఖ ఉక్కు పరిశ్రమపై సీఎం జగన్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. ఉక్కు పరిశ్రమపై ఆధారపడి లక్ష కుటుంబాలు ఉన్నాయని చెప్పారు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు అన్నీ అమ్మేస్తారా? అని నిలదీశారు. పోస్కోతో విజయసాయిరెడ్డి ఏం చర్చించారో చెప్పాలని డిమాండ్ చేశారు.

"పోస్కో సంస్థతో మూడుసార్లు వైకాపా నేతలకు విందు భేటీలు జరిగాయి. ఆ సమావేశాల్లో విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ఉక్కు పరిశ్రమకు ఎక్కడ స్థలాలున్నాయో తెలుసుకున్నారు. సీతమ్మధారలోని 21 ఎకరాలు కొట్టేయాలని చూస్తున్నారు. పోస్కోతో మీకది - మాకిది ఒప్పందం చేసుకున్నారు. విశాఖ ఉక్కుపై సీఎం జగన్‌ ఎందుకు మాట్లాడటం లేదు? రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోనే పోస్కో వచ్చింది" - దేవినేని ఉమ, మాజీ మంత్రి

తలసరి ఆదాయంలో గాజువాక నెంబర్‌వన్‌గా నిలవడానికి కారణం విశాఖ ఉక్కు పరిశ్రమే అని.. దేవినేని ఉమ స్పష్టం చేశారు. పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా తెదేపా అధినేత చంద్రబాబు విశాఖలో పర్యటించనున్నట్టు చెప్పారు.

ఇదీ చదవండి:

'విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ'పై 18న రాష్ట్ర వ్యాప్త నిరసనలు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.