ETV Bharat / city

విశాఖ అగ్ని ప్రమాదంపై ప్రతిపక్షాల నిరసన...పలువురు అరెస్ట్

విశాఖ ఫార్మాసిటీలో జరిగిన అగ్ని ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ప్రతిపక్షనేతలు ఆరోపించారు. ప్రమాదస్థలిని పరిశీలించేందుకు వెళ్లిన తెదేపా, సీపీఐ, జనసేన, భాజపా నేతలను పోలీసు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదంలో మృతి చెందిన కెమిస్ట్ మృతదేహాన్ని కేజీహెచ్ లో ఉంచారు. మృతుని బంధువులను కలిసేందుకు కేజీహెచ్ కు వచ్చిన సీపీఎం, సీఐటీయూ నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విశాఖ అగ్ని ప్రమాదంపై నిరసన... ప్రతిపక్షనేతలు అరెస్ట్

author img

By

Published : Jul 14, 2020, 5:19 PM IST

విశాఖ పరవాడ ఫార్మాసిటీలో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వమే కారణమని రాజకీయ నేతలు ఆరోపించారు. ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించేందుకు ప్రయత్నించిన ప్రతిపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెదేపా నేత బండారు సత్యనారాయణమూర్తి, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, జనసేన, భాజపా నేతలను పరిశ్రమ సమీపంలోకి వెళ్లకుండా పోలీసులు అదుపులోకి తీసుకుని, సమీప పోలీసు స్టేషన్ కు తరిలించారు.

ఎవరిది బాధ్యత?

ప్రమాదం జరిగిన తీరును ఇంతవరకూ ఏ అధికారి వివరాలు చెప్పలేదని ప్రతిపక్షనేతలు ఆరోపించారు. ప్రమాదంలో మరణించిన సీనియర్ కెమిస్ట్ గురించి కనీస సమాచారం ఇవ్వకపోవడాన్ని రాజకీయ పక్ష నేతలు తప్పుబట్టారు. ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.

అరెస్టులు

విశాఖ పరవాడ రాంకీ ఫార్మా కంపెనీ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కెమిస్ట్ కాండ్రేగుల శ్రీనివాస్ మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీలో ఉంచారు. మృతదేహాన్ని చూసేందుకు కేజీహెచ్ కు వచ్చిన సీపీఎం, సీఐటీయూ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత కుటుంబ సభ్యులను కలిసేందుకు వచ్చిన తమను అక్రమంగా అరెస్టు చేశారని సీపీఎం నేత సి.హెచ్. నరసింగరావు, సీఐటీయూ నాయకుడు వి.వి.శ్రీనివాసరావులు ఆరోపించారు.

ఇదీ చదవండి : 'కుయ్, కుయ్ కాదు... కుయ్యో, మొర్రో అంటున్నాయ్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.