ETV Bharat / city

విశాఖ ఇన్​పై పోలీసులు దాడి...అదుపులోకి అనుమానితులు - visakha police

విశాఖ అల్లిపురం కూడలిలో ఉన్న విశాఖ ఇన్ హోటల్​ను పోలీసులు సీజ్ చేశారు. హోటల్​లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు ..అనుమానితులైన ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలుంటాయని డీసీపీ రంగారెడ్డి హెచ్చరించారు.

విశాఖ ఇన్​పై పోలీసులు దాడి...అదుపులోకి అనుమానితులు
author img

By

Published : Aug 25, 2019, 12:00 AM IST

Updated : Aug 25, 2019, 5:29 AM IST

విశాఖ ఇన్​పై పోలీసులు దాడి...అదుపులోకి అనుమానితులు
విశాఖ అల్లిపురం కూడలిలో ఉన్న విశాఖ ఇన్ హోటల్​లో రెండో పట్టణ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. హోటల్​లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారంతో డీసీపీ, మహారాణి పేట ఎమ్మార్వో ఆధ్వర్యంలో తూర్పు ఏసీపీ నేతృత్వంలో హోటల్​పై దాడులు చేశారు. హోటల్​లో ముంబయి, గుజరాత్​కు చెందిన ఇద్దరు యువతులు అనుమానంగా కనిపించడం వలన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హోటల్​కు సంబంధించిన కంప్యూటర్, ల్యాప్ టాప్ , హార్డ్ డిస్క్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హోటల్ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు నిర్ధరణ అయిన అనంతరం హోటల్​ను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. నగరంలోని కొన్ని స్పా సెంటర్లపై ఫిర్యాదులొచ్చాయన్న పోలీసులు.. స్పా యజమానులను పిలిపించి తగు సూచనలు చేశామన్నారు. స్పా సెంటర్లలో తప్పని సరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు.

ఇదీ చదవండీ...పోలవరం ప్రాజెక్టుపై సీఎం జగన్ సమీక్ష

Intro:సెంటర్:తణుకు, జిల్లా:పశ్చిమగోదావరి
రిపోర్టర్:ఎం. వెంకటేశ్వర రావు
ఫోన్ 9394450286
AP_TPG_14_24_MAHILAA_DONGA_ARREST_AV_AP10092
( . )పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ పోలీసులు బస్సులలో ప్రయాణికుల ఆభరణాలు చోరీ చేస్తున్న మహిళను అరెస్టు చేసి, ఆరు తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. Body:గత నెల 22వ తేదీన పెనుగొండ నుంచి నరసాపురం వెళుతున్న బస్సులో ఆభరణాలు చోరీకి గురి కావడంతో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. Conclusion:పెనుగొండ మండలం దొంగరావిపాలెం వద్ద తనిఖీలు చేస్తుండగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నాగళ్ల రమణ అనే మహిళ పట్టుబడింది. ఆమె నుంచి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలును కోర్టులో హాజరు పరచనున్నట్టు పోలీసులు తెలిపారు.
Last Updated : Aug 25, 2019, 5:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.