విశాఖలో గతేడాది డిసెంబర్ 20న జరిగిన రౌడీషీటర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. అతనితో సహజీవనం చేస్తున్న మహిళే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిపారు. విశాఖ ఈస్ట్ ఏసీపీ హర్షిత చంద్ర ఈ కేసు వివరాలను తెలిపారు. నగరానికి చెందిన రౌడీషీటర్ సుభాన్... పర్వీన్ అనే మహిళతో సహజీవనం చేశాడు. గత నెల 20వ తేదీన వీరిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. పెనుగులాటలో సుభాన్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. భయంతో పర్వీన్ వెంటనే ఇంటికి తాళం వేసి పరారైంది. ఘటన జరిగిన 10 రోజులు తర్వాత ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు... ఈ నెల 11న కృష్ణా జిల్లా నూజివీడులో నిందితురాలిని పట్టుకున్నారు. హత్య ఎందుకు చేయాల్సి వచ్చిందన్న విషయాలపై లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని ఏసీపీ తెలిపారు.
ఇదీ చదవండి: ఆటోతో హత్యాయత్నం.. ఒకసారి కాదు.. రెండుసార్లు!