వాహనాలకు అంటించే స్టిక్కర్లపై విశాఖ నగర పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఆయా వాహనాల తనిఖీలకు ఆదేశాలు ఇచ్చారు నగర సీపీ మనీశ్ కుమార్ సిన్హా. ఫలితంగా గత రెండు రోజులుగా నగరంలో.. పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. ప్రతి కూడలిలో, కీలక ప్రాంతాల్లో నిఘా వేయడంతో.. ఆయా స్టిక్కర్లతో పలువురు కనిపించారు.
వెలుగులోకి విస్తుపోయే విషయాలు..
పోలీసుల ప్రత్యేక తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. ఆయా విభాగాలతో వారికి అసలు సంబంధం లేకున్నా వాహనాలపై పేర్లు రాసుకోవడాన్ని గుర్తించారు. అయితే మొదటి తప్పిదం కింద పరిగణించి, తీవ్రంగా హెచ్చరించి వదిలేస్తున్నారు. అనధికారికంగా ఆయా స్టిక్కర్లను అతికించుకుని తిరుగుతున్నవారిలో పలువురు పోలీసు, మీడియా రంగాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారి కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులే అధికంగా ఉంటున్నట్లు తేలింది. ఈ అంశంపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. అయితే వారు ఎందుకు ఇలా వాడుతున్నారు..? ఇలాంటి వారిలో ఎవరిపైనైనా నేర చరిత్ర ఉందా.. అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. అందరి వాహనాల వివరాలను నమోదు చేసుకున్నారు.
ఇదీ చదవండి