Police Action on sound pollution: శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడంలో భాగంగా అధిక ధ్వని కలిగించే సైలెన్సర్ వినియోగిస్తున్న ద్విచక్రవాహనదారులపై పోలీసులు కొరడా ఝళిపించారు. విశాఖ మహా నగరంలో ఇటీవల కాలంలో ద్విచక్రవాహనాలకు కంపెనీలు అమర్చే సైలెన్సర్లను తీసేసి అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను వినియోగిస్తూ పలు ప్రాంతాల్లో అధిక శబ్దం కలిగిస్తూ నడుపుతున్న వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అలా ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డ సుమారు 1200 ద్విచక్రవాహనాల సైలెన్సర్లను ఇవాళ బీచ్ రోడ్‌లోని పోలీస్ మెస్ వద్ద రోడ్ రోలర్‌తో తొక్కించారు. ఈ కార్యక్రమాన్ని నగర పోలీస్ కమిషనర్ సి.హెచ్. శ్రీకాంత్ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.
ఇవీ చూడండి: