విశాఖ జిల్లా మల్కాపురంలో చమురు కంపెనీల వద్ద ఆయిల్ ట్యాంకర్ల సిబ్బంది నిరసన తెలిపారు. పెట్రోల్ ట్యాంకర్ల యజమానులు, డ్రైవర్లు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. తమను పోలీసులు అకారణంగా వేధిస్తున్నారని వారు ఆరోపించారు.
ఇష్టారీతిన చలాన్లు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మల్కాపురం నుంచి షీలా నగర్ వరకు 24 గంటలు ఆయిల్ ట్యాంకర్లు తిరిగేందుకు అనుమతులున్నా.. మల్కాపురం సీఐ విజయ సాగర్ కేసులు నమోదు చేస్తున్నారని వాపోయారు.
ఒక్కొక్క ఆయిల్ ట్యాంకర్ కు రూ.2,500 చలానా రాసి లారీ యజమానులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఆయిల్ ట్యాంకర్లపై పెట్టిన కేసులు ఉపసంహరించుకునే వరకు ఆయిల్ ట్యాంకర్లను నడిపేది లేదని యూనియన్ నాయకులు తేల్చి చెప్పారు.
ఇదీ చదవండి : OLD STUDENTS PROTEST: కళాశాలల భూములు తాకట్టు నుంచి తప్పించాలంటూ ధర్నా