విశాఖలో ఉల్లి కష్టాలు రోజరోజుకు తీవ్రమవుతున్నాయి. పెరుగుతున్న ఉల్లిధరతో సామాన్యులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం రైతు బజార్లలో రాయితీలు అందించే ఉల్లి కోసం తెల్లవారుజాము నుంచి ప్రజలు క్యూలు కడుతున్నారు. మహారాష్ట్ర నుంచి దిగుమతి లేనందున కేవలం కర్నూలు నుంచి వచ్చే ఉల్లిపైనే ఆధారపడటం వల్ల ఉల్లి కొరత ఏర్పడింది. నగరంలో ఉన్న డిమాండ్‌లో కేవలం 30 శాతం మాత్రమే ఉల్లి దిగుమతి అవుతున్నట్లు తెలుస్తుంది. ఫలితంగా రాయితీ ధరపై అందించే ఉల్లిని కేవలం అరకిలోకు పరిమితం చేశారు. దీంతో రైతు బజార్లన్నీ సామాన్యులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో ప్రజలు అసహనం వ్యక్తం అవుతున్నాయి. మార్కెటింగ్ శాఖ తక్షణం స్పందించి ఉల్లి ధరలను నియంత్రణలో తీసుకువచ్చి... డిమాండ్‌కు అనుగుణంగా తీసుకురావాలని సామాన్యులు కోరుతున్నారు.
ఇదీ చదవండి :