ETV Bharat / city

విశాఖలోని వాడల్లో 506 పార్కులు.. ! - జీవీఎంసీ తాజా వార్తలు

నగర వీధుల్లో మరిన్ని పార్కులు హాయినివ్వబోతోన్నాయి. సేదతీరేందుకు నీడనివ్వబోతున్నాయి. పచ్చదనం మధ్య ఆడుకునేందుకు కాసింత స్థలాన్నీ ఇవ్వబోతున్నాయి. నగరంలోని ఖాళీ స్థలాల్లో ‘గ్రీన్‌ స్పేస్‌ పార్కులుగా’ ప్రజల ముందుకు రానున్నాయి.

parks in gvmc
parks in gvmc
author img

By

Published : Jun 22, 2020, 1:04 PM IST

విశాఖ నగరవ్యాప్తంగా 1032 ఖాళీ స్థలాలున్నట్లు జీవీఎంసీ గుర్తించింది. ఇందులో గ్రీన్‌స్పేస్‌ పార్కులు ఏర్పాటు చేయడానికి 506 ఖాళీ స్థలాలు అనువుగా ఉన్నట్లు తేల్చారు. విడతల వారీగా మొక్కలు నాటడం, పార్కుగా మార్చడం చేయనున్నారు. తొలి విడతగా జోన్‌-1, 5, 6లో పనులు మొదలుపెట్టడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే 10 ప్రాంతాల్లో పార్కుల నిర్మాణానికి పనుల్ని అప్పగించినట్లు జీవీఎంసీ ఇంజినీర్లు చెబుతున్నారు. తాజాగా పెదగంట్యాడలో 3 పార్కులతో పాటు వడ్లపూడి దగ్గరున్న తిరుమలనగర్‌, చినముషిడివాడ దగ్గర్లోని శ్రమశక్తినగర్‌, దిబ్బపాలెం సమీపంలోని శ్రీనగర్‌, దేశపాత్రునిపాలెం ప్రాంతాల్లో సుమారు రూ.26లక్షలతో పార్కుల్ని ఏర్పాటు చేసేందుకు టెండర్లు పిలిచారు.

రూ.60 కోట్లు ఎలా..?

ప్రతిపాదిస్తున్న పార్కులు పూర్తిచేయడానికి సుమారు రూ.60కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనాలు వేస్తున్నారు. ఇంత డబ్బు జీవీఎంసీ కేటాయించగలదా అనేది ఇప్పుడు సందేహంగా ఉంది.

కాలుష్య నియంత్రణ మండలితో పాటు పరిశ్రమలు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర సంస్థలు, వీఎంఆర్‌డీఏ, అటవీశాఖ.. ఇలా ఇతరత్రా విభాగాలు ప్రతిపాదిత స్థలాల్ని దత్తత తీసుకుంటే లక్ష్యాన్ని త్వరగా అధిగమించొచ్చని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కమిషనర్‌ జి.సృజన స్థాయిలో ఇతర విభాగాలతో సంప్రదింపులు నడుస్తున్నాయి.

కాలుష్యం తగ్గుతుంది..

అన్నీ కుదురుకుంటే నగరవ్యాప్తంగా ప్రతిపాదిస్తున్న గ్రీన్‌స్పేస్‌ పార్కులన్నీ ఏడాదిలోపు పూర్తవుతాయని జీవీఎంసీ ఉద్యాన విభాగం ఏడీ ఎం.దామోదర్‌రావు తెలిపారు. ప్రస్తుతం ఆయా పార్కులకు అవసరమైన ప్రహరీలు, ఫెన్సింగ్‌ల మీద ఇంజినీర్లు సర్వే చేస్తున్నారని వివరించారు. పార్కుల్లో వాడే మొక్కలు కూడా స్థానిక వాతావరణానికి తట్టుకునే తెస్తున్నామని అన్నారు. ప్రహరీకి ఆనుకుని ఎత్తుగా పెరిగేందుకు రాగి, మర్రి, వేప, బాదం, నిద్రగన్నేరు లాంటివి మొక్కల్ని వినియోగిస్తామని అన్నారు. ఈ ప్రయత్నంతో నగరంలోని కాలుష్య కారకాల్ని మరింతగా తగ్గించొచ్చని వివరించారు.

పార్కులు ఎలా ఉంటాయంటే...

  • చుట్టూ ప్రహరీ, దీన్ని ఆనుకుని ఎత్తుగా పెరిగే మొక్కల్ని నాటుతారు.
  • ప్రహరీకి అనువుగా లేని చోట కంచెగానీ, మొక్కలతోనే బయోఫెన్సింగ్‌ గానీ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో డబ్బు ఆదా అయ్యే అవకాశముంది.
  • పార్కులో నడకబాట, బెంచీలుంటాయి. చుట్టుపక్కల పచ్చిక, పూలమొక్కలు లాంటివి పెంచుతారు.
  • నీటి అవసరాలకోసం ప్రత్యేకంగా ఒక బోరునూ వేస్తారు.
  • స్థానికులు దీన్ని చిన్నచిన్న కార్యక్రమాలకు వినియోగించుకునేలా చేసుకోవచ్ఛు

ఇదీ చదవండి: పాక్ సైన్యం కాల్పుల్లో భారత జవాన్ మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.