కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వాల్తేర్ డివిజన్ అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ వ్యాప్తి చెందకుండా డివిజన్ పరిధిలో చర్యలు తీసుకున్నామని వాల్తేర్ డీఆర్ఎం చేతన్‌కుమార్ శ్రీ వాస్తవ్ తెలిపారు. డివిజన్లో ఉన్న రైల్వే స్టేషన్లు, కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని సూచించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా రైల్వే ట్రాక్‌ల వెంబడి బాధ్యతలు నిర్వహించే ట్రాక్, గ్యాంగ్ మెన్లకు ఉచితంగా రెండున్నర లీటర్ల మంచినీటి క్యాన్లను అందజేశారు.
ఇదీ చదవండి :