విశాఖ జిల్లా డుంబ్రిగుడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆయుర్వేద అస్పత్రిలో సిబ్బంది లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యులు లేకపోవటంతో గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ పనిచేసే స్వీపర్... చిన్నచిన్న వ్యాధులకు మందులిస్తూ రోగులు ఇబ్బందులు పడకుండా చూస్తున్నాడు. ప్రతినెల లక్షలాది రూపాయల మందులు వస్తున్నప్పటికి వాటిని రోగులకు అందించే వైద్యాధికారులు లేక అవి నిరుపయోగంగా మారుతున్నాయి. వెంటనే అధికారులు స్పందించి వైద్యులను నియమించాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి: