ETV Bharat / city

నౌకాదళ రహస్యాల గూఢచర్యం కేసులో ప్రధాన కుట్రదారుడు అరెస్టు - విశాఖ నేవీ గూఢచర్యం కేసులో ప్రధాన కుట్రదారు అరెస్టు

విశాఖ నౌకాదళ రహస్యాల గూఢచర్యం కేసులో ప్రధాన కుట్రదారుడిని ఎన్​ఐఏ అరెస్టు చేసింది. నిందితుడు ముంబయికి చెందిన మహ్మద్​ హరూన్ హాజీగా గుర్తించింది.

NIA arrests key conspirator in Visakhapatnam espionage case

author img

By

Published : May 15, 2020, 7:06 PM IST

Updated : May 16, 2020, 7:28 AM IST

నౌకాదళంలో గూఢచర్యం కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ కీలకమైన వ్యక్తిని అరెస్టు చేసింది. ముంబైలోని మహ్మద్ హరూన్ హాజీ అబ్దుల్ రెహ్మాన్ లక్కడ్ వాలా అనే వ్యక్తిని ఈ కేసులో అరెస్టు చేసినట్టు ఎన్ఐఏ వెల్లడించింది. హరూన్ హాజీ విశాఖ నౌకాదళ కమాండ్ కేంద్రంగా కొందరు సిబ్బందికి డబ్బు ఆశ చూపి యుద్ధనౌకలు, జలాంతార్గాముల రాకపోకల సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేసినట్టు ఎన్ఐఏ తెలిపింది.

పాకిస్తాన్​కు కీలక సమాచారం

విశాఖలోని తూర్పు నౌకాదళ కమాండ్ లో నౌకాదళ రహస్యాలను గూఢచర్యం చేస్తున్న కేసులో ముంబై కి చెందిన మహ్మద్ హరూన్ హాజీ అబ్దుల్ రెహ్మాన్ లక్కడ్ వాలా అనే వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ అరెస్టు చేసింది. నౌకాదళ రహస్యాలను పాకిస్తాన్ కు చేరవేస్తున్న కేసులో ప్రధాన కుట్రదారుగా మహ్మద్ హరూన్ హాజీని ఎన్ ఐఏ పేర్కొంది. నౌకాదళానికి చెందిన యుద్ధనౌకలు, జలాంతర్గాములకు సంబంధించిన రాకపోకలు, ఇతర కీలకమైన సమాచారాన్ని ఇతను పాకిస్తాన్ కు చేరవేస్తున్నట్టుగా ఎన్ఐఏ గుర్తించింది.

ఎన్ఐఏ అదుపులో 11 మంది

ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నౌకాదళ సిబ్బంది సహా 11 మందిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఇందులో పాకిస్తాన్ లో జన్మించిన ఓ భారత జాతీయుడైన షాయిస్తా ఖైజర్ కూడా ఉన్నట్టు ఎన్ఐఏ వెల్లడించింది. వీరందరిపైనా విజయవాడలోని కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసు స్టేషన్ లో దేశద్రోహం, దేశరహస్యాల గూఢచర్యం, కుట్ర తదితర అభియోగాలపై కేసులు నమోదు చేశారు. మహ్మద్ హరూన్ హాజీ ఇంటి నుంచి కొన్ని కీలకమైన పత్రాలతో పాటు గూఢచర్యానికి సంబంధించిన డిజిటల్ పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు ఎన్ఐఏ తెలిపింది.

భారత్​లో ఏజెంట్ల నియామకం

పాకిస్తాన్ కు చెందిన కొందరు గూఢచారులు భారత్ లో ఈ వ్యవహరానికి సంబంధించి ఏజెంట్లను నియమించుకున్నారని వీరు నౌకాదళంలోని కొందరికి డబ్బు ఆశ చూపి యుద్ధనౌకలు, జలాంతర్గాముల రాకపోకలు, ఇతర కీలకమైన సమాచారాన్ని అక్కడికి చేరవేస్తున్నట్టు ఎన్ఐఏ దర్యాప్తులో గుర్తించింది. నౌకాదళంలోని కొందరు సిబ్బంది ఫేస్ బుక్, వాట్సప్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా పాకిస్తాన్ వ్యక్తులకు పరిచయమయ్యారని..డబ్బుపై మోహంతో నౌకాదళానికి చెందిన సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా చేరవేసినట్టు తేలిందని ఎన్ఐఏ తెలియజేసింది.

సమాచారం ఇచ్చినందుకు నగదు బదిలీ

పాకిస్తాన్ లో వ్యాపార సంబంధాలున్న కొందరు వ్యక్తులు సదరు నౌకాదళ సిబ్బంది బ్యాంకు ఖాతాల్లోకి నగదును చేరవేశారని ప్రాథమిక దర్యాప్తులో తెలిపింది. మహ్మద్ హరూన్ హజీ కొన్ని మార్లు పాకిస్తాన్ కు వెళ్లి అక్కడి గూఢచారులైన అక్బర్ అలీ అలియాస్ రిజ్వాన్ తో భేటీ అయ్యాడని .. అతని ఆదేశాల మేరకు హరూన్ హాజీ నౌకాదళ సిబ్బంది ఖాతాల్లోకి తరచుగా నగదు జమచేసినట్టు ఎన్ ఐఏ వెల్లడించింది. ముంబయిలో నౌకాదళ గూఢచర్యం కేసులో అరెస్టు చేసిన మహ్మద్ హరూన్ హాజీ అబ్దుల్ రెహ్మాన్​ను ముంబయిలోని కోర్టులో ఎన్ఐఏ అధికారులు హాజరు పరిచారు. అనంతరం అతన్ని విజయవాడ తరలించి స్థానిక కోర్టులో హాజరు పర్చనున్నారు. అనంతరం రిమాండ్​కు తీసుకోనున్నారు.

ఇదీ చదవండి:

కరోనా 'దండోరా'... కర్ణాటకలో అడుగుపెట్టొద్దు..!

Last Updated : May 16, 2020, 7:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.