ETV Bharat / city

కలకలం రేపుతున్న అన్నదమ్ముల గూఢచర్యం కుట్ర - NIA

వారిద్దరూ అన్నదమ్ములు. ఒకరేమో భారత నౌకాదళం రహస్యాలు పాకిస్థాన్‌కు చేరవేస్తే... మరొకరు సైన్యం సమాచారాన్ని తస్కరించారు. చివరికి ఇద్దరూ జాతీయ దర్యాప్తు సంస్థకు చిక్కి కటకటాల్లోకి వెళ్లారు. విశాఖపట్నం గూఢచర్య రాకెట్ కేసులో గతంలోనే పట్టుబడ్డ ఇమ్రాన్ గిటెలీ, ఉత్తరప్రదేశ్ గూఢచార్యం కేసులో తాజాగా అరెస్టైన అనస్ గిటెలీల ఉగ్ర కథ ఇది.

అన్నదమ్ముల గూఢచర్యం కుట్ర
అన్నదమ్ముల గూఢచర్యం కుట్ర
author img

By

Published : Apr 15, 2021, 6:12 AM IST

అన్నదమ్ముల గూఢచర్యం కుట్ర

దేశ రహస్యాలను దాయాది దేశానికి చేరవేస్తూ అన్నదమ్ములు సాగించిన చీకటి వ్యవహారాలు కలకలం రేపుతున్నాయి. గుజరాత్‌లోని పంచమహల్ జిల్లా గోద్రా ప్రాంతానికి చెందిన గిటెలీ సోదరులు... పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్​ఐకి ఏజెంట్లుగా పనిచేస్తూ, భారత్‌లో ఉగ్ర కార్యకలాపాలు సాగించారని ఎన్​ఐఏ గుర్తించింది. వస్త్ర వ్యాపారం ముసుగులో తరచూ పాకిస్థాన్‌కు వెళ్లి... ఐఎస్​ఐ చెప్పినట్లు చేసేవారని దర్యాప్తులో తేలింది. వీరిని నడిపించింది ఎవరు, ఈ రెండు కేసుల వెనుక ఉన్న సూత్రధారి ఒకరేనా, ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణాల్లో ఎన్​ఐఏ దర్యాప్తు సాగిస్తోంది.

విశాఖపట్నం గూఢచర్యం కేసులో నిందితుడైన ఇమ్రాన్ గిటెలీ... తొలుత లేడీస్‌టైలర్‌గా, ఆ తర్వాత ఆటోడ్రైవర్‌గానూ పని చేశాడు. భారత్‌లో దుస్తులు విక్రయించే ముసుగులో ఐఎస్​ఐ ఏజెంటుగా మారాడు. అసఫ్ అనే వ్యక్తి నుంచి వచ్చే ఆదేశాలు పాటిస్తూ... విశాఖ, ముంబయి నౌకాదళ కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగుల్ని ప్రలోభాలకు గురిచేసేవాడు. దేశంలోని కీలక సంస్థలు, రక్షణ స్థావరాలు, అంతరిక్ష పరిశోధన కేంద్రాలు, వ్యూహాత్మక ప్రదేశాలు లాంటి రక్షణ సమాచారం, చిత్రాలు, వీడియోలు సేకరించి... పాకిస్థాన్ నిఘా విభాగానికి చేరవేసేవాడు. సమాచారం ఇచ్చిన నేవీ ఉద్యోగుల ఖాతాల్లో పెద్దమొత్తంలో డబ్బులు జమ చేసేవాడు. ఇలా ఏడాది వ్యవధిలోనే 65 లక్షల వరకూ జమ చేసినట్లు ఎన్​ఐఏ గుర్తించింది. గతేడాది సెప్టెంబరులో ఇమ్రాన్ గిటెలీని అరెస్టు చేసిన అధికారులు... మార్చిలో అభియోగపత్రం దాఖలు చేశారు.

ఇమ్రాన్ గిటెలీ సోదరుడు అనస్ గిటెలీ పాకిస్థాన్ కుట్రలో భాగస్వామిగా, వారు చెప్పినట్లు చేసేవాడనేది ప్రధాన అభియోగం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాకు చెందిన సౌరభ్‌ శర్మ అనే వ్యక్తి... ఇండియన్ ఆర్మీలో కొన్నాళ్లపాటు జవానుగా పనిచేసి 2000 సంవత్సరంలో అనారోగ్య కారణాలతో బయటకొచ్చేశాడు. అంతకుముందు సైన్యానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని అనస్ ద్వారా ఐఎస్​ఐ ఏజెంట్లకు చేరవేసేవాడు. సౌరభ్‌ శర్మ భార్య ఖాతాలో అనస్ ఎప్పటికప్పుడు డబ్బులు జమ చేసేవాడు. ఉత్తరప్రదేశ్ ఉగ్రవాద నిరోధక బృందం తొలుత ఈ కుట్రను ఛేదించింది. దాని ఆధారంగా ఎన్​ఐఏ ఇటీవల కేసు నమోదు చేసి అనస్‌ను అరెస్టు చేసింది.

అన్నదమ్ములిద్దరూ గూఢచర్యం అభియోగాలపై కొన్ని నెలల వ్యవధిలో అరెస్టు కావడం సంచలనం సృష్టిస్తోంది. నౌకాదళ, సైనిక ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి ద్వారా అందాయి, ఐఎస్​ఐ తరపున ఇంకా ఎవరెవరు పని చేస్తున్నారనే కోణాల్లో ఎన్​ఐఏ ఆరా తీస్తోంది. ఇమ్రాన్ గిటెలీని నడిపించిన అసఫ్ అనే వ్యక్తి.... అనస్ గిటెలీని కూడా నడిపించాడా, ఈ రెండు కేసుల్లోనూ పాకిస్థాన్‌కు చెందిన ఇక్బాల్ దోబా ప్రమేయం ఉందా అనే వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.

ఇదీ చదవండీ... పరిషత్ ఎన్నికలు: వర్ల రామయ్య పిటిషన్​పై ఇవాళ హైకోర్టులో విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.