విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇండియన్ నేవీలో పని చేస్తున్న ఓ వ్యక్తి (Navy employee died in road accident) మృతి చెందాడు. మృతుడు ఇండియన్ నేవీలో పనిచేస్తున్న అనిల్ కుమార్(33)గా గుర్తించారు. అనిల్‌కుమార్ శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో సిరిపురం నుంచి రైల్వే స్టేషన్ వైపు దిచక్రవాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై డివైడర్‌ను ఢీకొట్టి పక్కన(accident at telugu talli flyover at visakha) పడిపోయాడు.
అటుగా కారులో వెళ్తున్న ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రుడిని రాంనగర్ సెవెన్ హిల్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. అతను అప్పటికే మృతి చెందినట్లు(accident at telugu talli flyover at visakha) ధ్రువీకరించారు. ప్రమాద సమయంలో అతడు హెల్మెట్ ధరించి ఉన్నప్పటికీ ప్రాణాలు దక్కలేదు. రెండవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇండియన్ నేవీ అధికారులకు సమాచారం అందించారు.
ఇదీ చదవండి..