తూర్పు నావికా దళానికి చెందిన ఐఎన్ఎస్ విశ్వకర్మలో హల్ ఆర్టిఫిసర్ అప్రంటీసులకు బుధవారం పాసింగ్ అవుట్ పెరేడ్ నిర్వహించారు. విశ్వకర్మ కమాండింగ్ అధికారి కమొడోర్ నగేషన్ ముఖ్యఅతిథిగా పాల్గొని తొలుత నావికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ విభాగంలో 48వ బ్యాచ్ నుంచి 42 మంది హెచ్ఏఏలు, ఐదుగురు తీరగస్తీ దళ సిబ్బందితో పాటు మారిషస్ దేశానికి చెందిన ఓ పోలీసు కానిస్టేబుల్ శిక్షణ పూర్తి చేసుకున్నారని నేవి వర్గాలు వెల్లడించాయి. శిక్షణ పొందిన వారు త్వరలో విధుల్లో చేరనున్నట్టు వివరించాయి.
ఇదీ చదవండి :