జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ పోటీలు ఆదివారం ఉత్సాహంగా సాగాయి. దేశవ్యాప్తంగా 3700 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు. జూనియర్, సబ్ జూనియర్, సీనియర్, మాస్టర్స్ విభాగాల్లో జరుగుతున్న ఈ పోటీల్లో.. పతకాలే లక్ష్యంగా క్రీడాకారులు తలపడుతున్నారు. స్పీడ్, ఆర్టిస్టిక్, రోలర్ హాకీ, ఇన్ లైన్ హాకీ, ఇన్ లైన్ ఫ్రీస్టైల్, ఇన్ లైన్ ఆల్పైన్, ఇన్ లైన్ డౌన్ హిల్, రోలర్ డెర్బీ, రోలర్ ఫ్రీస్టైల్, స్కేట్ బోర్టింగ్ విభాగాల్లో క్రీడాకారులు తలపడతున్నారు. ఈసారి జరుగుతున్న పోటీల్లో ఓకే వేదికపై పది విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు.
మెరిసిన తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు
స్పీడ్, స్కేటింగ్, రోలర్ ఫ్రీస్టైల్ విభాగంలో క్రీడాకారులు తమ ప్రదర్శనతో తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు ఆకట్టుకున్నారు. ఆర్టిస్టిక్ ఫ్రీ స్టైల్ పురుషుల 11 - 14 ఏళ్ల విభాగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. సోలో డాన్స్ పురుషులు 11-14ఏళ్ల విభాగంలో తెలంగాణ క్రీడాకారులు పతకాలు సాధించారు. స్కేట్ బోర్టింగ్, స్పీడ్ విభాగంలో చిన్నారుల ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది.
దేశవ్యాప్తంగా క్రీడాకారులు తరలిరావడంతో... వుడా, శివాజీ పార్కుల చుట్టపక్కల సందడి వాతావరణం నెలకొంది. ఇవాళ్టితో ఈ పోటీలు ముగియనున్నాయి.
ఇదీ చదవండి: