ETV Bharat / city

ఈనెల 23న జాతీయగీతం సామూహిక ఆలాపన - ఈనెల 23న విశాఖలో జనగణమన సామూహిక గీతాలాపన

విశాఖ నగరంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో.. ఈనెల 23న జాతీయగీతం సామూహిక ఆలాపన చేపడుతున్నారు. వివిధ కళాశాలల విద్యార్థులు, సంగీత సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని.. యాక్మీ ఈవెంట్ మేనేజ్​మెంట్ సంస్థ నిర్వాహకులు ప్రతాప్ కుమార్ పేర్కొన్నారు.

national anthem mass recitation in visakha
విశాఖ ఆంధ్రవిశ్వవిద్యాలయంలో జాతీయగీతం సామూహిక ఆలాపన
author img

By

Published : Jan 20, 2021, 7:15 PM IST

ఈనెల 23న జాతీయ గీతం సామూహిక ఆలాపనను.. విశాఖలోని ఈవెంట్ మేనేజ్​మెంట్ సంస్థ 'యాక్మీ' నిర్వహించనుంది. 1950 జనవరి 24న 'జనగణమన'ను జాతీయ గీతంగా భారత రాజ్యాంగం స్వీకరించిన సందర్భంగా.. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సంస్థ నిర్వాహకులు ప్రతాప్ కుమార్ తెలిపారు. నగరంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో.. గీతాలాపన జరుగనుందని వెల్లడించారు

ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను.. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య పీవీ జీడీ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి. కృష్ణమోహన్ ఆవిష్కరించారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కలం నుంచి జాలువారిన జన గణ మన గీతాన్ని.. విశాఖ నగరంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఇతర కళాశాల విద్యార్థులు, వివిధ సంగీత సంస్థల ప్రతినిధులు సామూహికంగా ఆలపించనున్నారని ప్రతాప్ కుమార్ వివరించారు.

ఇదీ చదవండి: గాయపరుస్తారు.. సెల్‌ఫోన్‌లు లాక్కెళతారు!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.