విశాఖలో ఇన్‌సైడర్ ట్రేడింగ్(insider trading)పై సీఎం అనిశాతో దాడులు చేయిస్తున్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. విశాఖ భూ కుంభకోణం( Visakha land scam)పై సిట్ నివేదికలో పేర్లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డిపై వస్తున్న అభియోగాలను తీవ్రంగా పరిగణించాలన్నారు. విజయసాయిరెడ్డికి చెందిన ప్రతిభా భారతి ట్రస్టుకు రూ.100 కోట్ల నిధులు విరాళంగా వచ్చాయన్నారు.
నదీ జలాలపై కేంద్రం జారీ చేసిన గెజిట్(gazette)పై వారంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం పట్ల స్పష్టత ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ను కోరారు. కేంద్ర గెజిట్‌కు సీఎం ధన్యవాదాలు తెలిపితే పార్లమెంటులో ఆ పార్టీ ఎంపీలు మాత్రం గెజిట్‌ను తప్పుబట్టారని పేర్కొన్నారు.
విశాఖ రాష్ట్ర రాజధాని కాకపోయినా అభివృద్ధి చెందుతుందని..విశాఖను రాజధానిగా ప్రకటించినప్పటి నుంచి భూకబ్జాలు, దాడులు, దందాల పేరిట అలజడి నెలకొందని.. దీంతో స్థానికంగా ప్రజలు భయపడే పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
గనులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడంలో ఆంతర్యమేంటి..?: కాలవ