లాక్ డౌన్ సమయంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదని... ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అన్నారు. విశాఖ పరిధిలోని రెడ్ జోన్లు అల్లిపురం, చలువతోటలో ప్రభుత్వ రేషన్ డిపోని ఆకస్మిక తనిఖీ చేశారు. లాక్ డౌన్ కారణంగా మూడో విడత ఉచిత రేషన్ సరకుల పంపిణీలో పారదర్శకతపై దృష్టిసారించాలన్నారు. బియ్యం తదితరాల పంపిణీపై లబ్దిదారులతో మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారు.
ఇవీ చదవండి: ఏప్రిల్, మే నెల జీతాలు చెల్లించలేం: స్పైస్‌జెట్