విశాఖలో తెదేపా నేతల ఆస్తుల్ని లాక్కుంటున్న వైకాపా ప్రభుత్వం వారిపైనే అక్రమ కేసులు పెట్టి వేధించడం సిగ్గుమాలిన చర్యని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని అనుమతులున్నా..మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటిని, గీతం యూనివర్సిటీ గోడను కూల్చారని ఆయన విమర్శించారు. ఫ్యూజన్ హోటల్‌కు కాలపరిమితి ఉన్నా..అర్ధరాత్రి ఖాళీ చేయించారని మండిపడ్డారు. వైకాపా ప్రలోభాలకు లొంగకుండా తెదేపాలొనే ఉన్నారన్న కక్షతో... ఇప్పుడు వెలగపూడి రామకృష్ణ బాబుని వేధిస్తున్నారని మంతెన ఆక్షేపించారు. విశాఖలో మంత్రి అవంతి అరాచకం అరగంటకొక దౌర్జన్యం, గంటకొక భూకబ్జాగా సాగుతోందని దుయ్యబట్టారు.
విశాఖలో ఉన్న సముద్రం కంటే అవంతి చేసిన కబ్జాలే ఎక్కువగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. జగదాంబ సెంటర్ నుంచి ఆర్కే బీచ్ వరకు ఏ వీధిలో చూసినా..ప్రజలు అవంతి భూకబ్జాల గురించే మాట్లాడుకుంటున్నారన్నారు. కరోనా సమయంలో అన్ని ప్రాంతాల్లోని విద్యార్థులు ఆన్లైన్లో పాఠాలు వింటుంటే.. విశాఖలోని విద్యార్థులు మాత్రం ప్రజలు చెప్పుకుంటున్న అవంతి భూకబ్జాల పాఠాలు వింటున్నారని విమర్శించారు. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి పోటీపడి మరీ భూకబ్జాలకు ప్పాలాడుతున్నారని ధ్వజమెత్తారు.
ఇదీచదవండి