విశాఖ కేజీహెచ్‌ను కరోనా ఆస్పత్రిగా మార్చొద్దని గవర్నర్‌కు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ లేఖ రాశారు. నిత్యం అనేక సమస్యలతో వేల మంది రోగులు ఈ ఆస్పత్రికి వస్తుంటారని...హృద్రోగులు, డయాలసిస్, ప్రసూతి, ఎముకల వైద్యం చేయించుకునేవారు వచ్చే ఏకైక పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి కేజీహెచ్ అని ఆయన లేఖలో వివరించారు. ఇది కరోనా వైద్యం కోసం కేటాయిస్తే మిగిలిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడతారని లేఖలో పేర్కొన్నారు. కేజీహెచ్ ను జనరల్ ఆసుపత్రిగానే కొనసాగించడం వల్ల ఎక్కువమందికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ఉత్తరాంధ్ర వాసుల అతి పెద్ద ఆసుపత్రి అయిన కేజీహెచ్ ను సాధారణ వైద్యం కోసం వినియోగించుకోవాలని వాసుపల్లి కోరారు.
ఇవీ చదవండి: 'కరోనాకు భయపడొద్దు.. మనమే భయపెట్టాలి'