ఎల్జీ పాలిమర్స్ బాధితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. గోపాలపట్నంలో ఎల్జీ పాలిమర్స్ బాధితుల కోసం ఏర్పాటు చేసిన ఆసుపత్రిని ఆయన సోమవారం సందర్శించారు. వైద్య సదుపాయాలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.... దుర్ఘటన జరిగి ఇన్ని రోజులు గడిచినా ఆస్పత్రిలో కనీస వసతులు లేకపోవటం దురదృష్టకరమని అన్నారు. కనీసం బీపీ, షుగర్ పరీక్షలు కూడా జరగట్లేదని వెల్లడించారు.
ఎల్జీ పాలిమర్స్ చుట్టు పక్క గ్రామాల ప్రజలకు ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం బాధాకరమని గణబాబు ఆవేదన వ్యక్తం చేశారు. హైపర్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని నిలదీశారు. హైపవర్ కమిటీ చేసిన సూచనలు తక్షణమే అమలు అయ్యే దిశగా ప్రభుత్వం నుంచి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కమిటీ నివేదికను బుట్టదాఖలు చేయొద్దని గణబాబు అన్నారు.
ఇదీ చదవండి