విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై మంత్రుల సమీక్ష - విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుపై మంత్రుల సమీక్ష వార్తలు
విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో పనులపై మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించారు. మెట్రో రైలు ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రాంతాన్ని పరిశీలించారు. మెట్రో రైలు ఎండీ రామకృష్ణా రెడ్డి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వీఎంఆర్డీఏ ఛైర్మన్ తదితరులు మంత్రుల వెంట ఉన్నారు.