విశాఖ వైకాపా కార్యాలయంలో ఆనందయ్య మందును పంపిణీ చేశారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ విజయసాయి ఈ కార్యక్రమంలో పాల్గొని పారిశుద్ధ్య కార్మికులకు ఈ మందు అందించారు. ఆనందయ్య మందు చక్కగా పనిచేస్తుందని మంత్రి ముత్తంశెట్టి అన్నారు. నగరంలో 20 వేల మందికి పైగా ఆనందయ్య మందు పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ఆనందయ్య ఔషధంపై ఎలాంటి అపోహలు వద్దని..దీనిని తాను కూడా వాడినట్టు మంత్రి చెప్పారు.
ఆనందయ్య మందు వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని.. మొదటి దశలో 22 వేల మంది ఫ్రంట్ లైన్ వర్కర్స్కు ఈ ఔషధాన్ని అందిస్తున్నట్టు ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. రెండో విడతలో జిల్లాలో ఉన్న ప్రజలు అందరికి ఆనందయ్య మందు అందిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: Money laundering: ఖతార్‌లో మనీలాండరింగ్‌కు పాల్పడిన విశాఖ వాసి ఆస్తులు జప్తు