ETV Bharat / city

విశాఖలో 6 వేలకు పైగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు: మంత్రి కన్నబాబు

విశాఖలో రోజుకు 6 వేలకు పైగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించి హోం ఐసోలేషన్​లో ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కేజీహెచ్​లో చిన్నారి చనిపోయిన విషయంపై విచారణ జరుపుతున్నామని చెప్పారు.

kannababu
kannababu
author img

By

Published : Apr 28, 2021, 9:26 PM IST

విశాఖలో 63 ఆస్పత్రుల్లో కరోనా చికిత్స అందిస్తున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు. కరోనా నిర్ధరణకు జిల్లా వ్యాప్తంగా 6 వేలకు పైగా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. విశాఖలో 18 చోట్ల ట్రూనాట్​ టెస్టులు చేస్తున్నట్లు చెప్పిన ఆయన.. ఆస్పత్రుల్లో 6,763 పడకలు ఉన్నట్లు చెప్పారు.

విశాఖలో 1,047 ఐసీయూ , 780 వెంటిలేటర్ పడకలున్నాయన్నారు. జిల్లాలో 7,072 రెమ్ డిసివిర్ ఇంజక్షన్లు ఉన్నట్లు చెప్పారు. చింతపల్లిలోనూ కొవిడ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఇదీ చదవండి: కరోనాతో షార్ట్ ఫిలిమ్స్ నటి అంజలి ఘోష్ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.