ETV Bharat / city

సెంటు భూమి కూడా అన్యాక్రాంతం కానివ్వం: మంత్రి కన్నబాబు - minister kannababu comments in visakhapatnam

విశాఖ పరిపాలన రాజధానిగా మారుతోందని...అక్కడ సెంటు భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా చూస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు.

minister kannababu comments in visakhapatnam
మంత్రి కన్నబాబు
author img

By

Published : Jun 1, 2020, 3:38 PM IST

విశాఖలో తాగునీటి సమస్యపై చర్చించామని మంత్రి కన్నబాబు అన్నారు. పరిపాలన రాజధానిగా విశాఖ మారుతోందని...ఈ తరుణంలో అక్కడ సెంటు భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా చూస్తామని మంత్రి అన్నారు. పేదలకు 29 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చేందుకు ముందుకెళ్తున్నామని...అర్హత ఉన్నవారు ఇళ్ల పట్టాలకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. విశాఖలో ప్రభుత్వ ఆస్తులు కాపాడాలని నిర్ణయించినట్లు తెలిపారు. విశాఖలో తాగునీటికి త్వరలో సీఎం ప్రాజెక్టు ప్రారంభిస్తారన్నారు. ప్రభుత్వ భూమి పేదలకు ఇస్తుంటే స్టేలు తేవడం ఎక్కడ సంస్కృతి అని ఆయన ప్రశ్నించారు.

మిడతల దండు భయం లేదు

రాష్ట్రానికి మిడతలదండు భయం లేదని.. అనంతపురం, శ్రీకాకుళంలో ఉన్నవి స్థానిక మీడతలు తప్ప మరొకటి కాదన్నారు. మిడతలపై సీఎస్ సారథ్యంలో ఇప్పటికే సమీక్ష జరిపామని...నిపుణులతో ఒక కమిటీ కూడా వేశామని మంత్రి తెలిపారు.

ఇవీ చదవండి: 'ప్రభుత్వాన్ని ఎంపీ విజయసాయి, సజ్జల నడిపిస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.