ప్రభుత్వ ఆదేశాలను అధికారులు పట్టించుకోనప్పుడు ప్రజా ప్రతినిధులు ప్రశ్నిస్తే... అది అసంతృప్తి ఎలా అవుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధులు తమ అభిప్రాయాలను చెప్పడం ప్రజాస్వామ్యంలో భాగమన్నారు.
ఎవరికి వారు తమ నియోజకవర్గాల స్థాయిలో సమస్యలను ఎత్తి చూపించడం సహజమని బొత్స స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి పూర్తి చేస్తామన్న ఆయన... ముఖ్యమంత్రి ప్రాధాన్యతగా తీసుకున్న ప్రాజెక్టుల్లో సుజల స్రవంతి ఒకటని చెప్పారు.