ఇళ్ల పట్టాల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతోందని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఇళ్లు, ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియపై విశాఖ జిల్లా కలెక్టరేట్లో ఆయన సమీక్షించారు. డిసెంబర్ 25న క్రిస్మస్, ముక్కోటి ఏకాదశితో పాటు పేదలు ఇళ్ల పండగ చేసుకునే రోజు అని వ్యాఖ్యానించారు. ఇళ్ల పట్టాల ప్రక్రియను ఆపేందుకు తెదేపా అధినేత చంద్రబాబు కోర్టులో కేసులు వేయించారని ఆరోపించారు.
తొలి విడతగా విశాఖ జిల్లాలో 1,94,256 మందికి ఇళ్లు, ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నాం.గ్రామీణ ప్రాంతాల్లో 1,16.352 ఇళ్ల పట్టాలు... 26 వేల400 టిడ్కో ఇళ్లను పంపిణీ చేస్తాం. పార్టీలకు సంబంధం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేశాం- మంత్రి అవంతి శ్రీనివాస్
ఇదీ చదవండి