తెలుగు భాషా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. గిడుగు రామ్మూర్తి జయంతి, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా విశాఖ సాగర తీరంలోని తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలవేసి ఆయన నివాళులర్పించారు. బతుకుదెరువు కోసం ఆంగ్ల విద్య నేర్చుకున్నప్పటికీ... జీవిత అనుభూతులతో పాటు సంస్కృతిని తెలియచెప్పేది మాతృభాష అని తెలిపారు. వైఎస్ జగన్ సీఎం కాగానే అధికార భాషా సంఘం ఏర్పాటు చేశారని చెప్పారు. ప్రముఖ ప్రజా గాయకుడు వంగపండు ప్రసాద్ కుమార్తెను రాష్ట్ర సాంస్కృతిక సంస్థకు ఛైర్మన్ చేశారని గుర్తు చేశారు.
ఇదీ చదవండి