ఎల్జీ పాలిమర్స్ వద్ద పరిస్థితి నియంత్రణలోనే ఉందని మంత్రి అవంతి పేర్కొన్నారు. వదంతులు నమ్మవద్దు.. ఆందోళనకు గురికావద్దని ఆయన సూచించారు. ఘటనాస్థలంలో ఉష్ణోగ్రత బాగా తగ్గిందన్న మంత్రి...5 గ్రామాల ప్రజలు 48 గంటలపాటు పునరావాస కేంద్రాల్లో ఉండాలన్నారు. ఆస్పత్రుల్లో ఉన్న 500 మందికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. పరిస్థితిని ఏడుగురు మంత్రులు సమీక్షిస్తున్నారన్న ఆయన... స్టైరిన్ వాయువును చాలా జాగ్రత్తలు తీసుకుని నియంత్రించాలని తెలిపారు. స్థానికులంతా మరో 2 రోజులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. మాకు కంపెనీ ముఖ్యం కాదని..ప్రజలే ముఖ్యమని మంత్రి అన్నారు. కమిటీ నివేదిక వచ్చాక పరిశ్రమపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
ఇవీ చదవండి...విశాఖ ఎల్జీ పాలిమర్స్ వద్ద గ్రామస్థుల ఆందోళన