కరోనా వ్యాప్తి నివారణలో విశాఖ ఫార్మా రంగం కీలక పాత్ర పోషిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ సమీపంలో ఏర్పాటు చేసిన మెడ్ టెక్ జోన్ వైద్య ఉత్పత్తులు ఇప్పుడు కరోనా పై పోరాటానికి ఆయుధాలుగా నిలిచాయి. కరోనా నిర్ధరణ చేసే రాపిడ్ టెస్ట్ కిట్లు ఇప్పుడు రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడుతున్నాయి. అదే విధంగా వెంటిలేటర్లు, డయోగోస్టిక్ పరికరాలు, వైద్యులకు ప్రత్యేక మాస్క్లు ఈ మెడ్ టెక్ జోన్‌లో రూపొందిస్తున్నారు. ప్రస్తుతం రాపిడ్ టెస్ట్ కిట్లు 3,500కు పైగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ చేసింది. కరోనా మహమ్మారిని తరిమి కొట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్న విశాఖ మెడ్ టెక్ జోన్ పై మరిన్ని వివరాలు మా విశాఖ ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు.
ఇవీ చదవండి: