కరోనా ఉద్ధృతి కట్టడి చర్యల్లో భాగంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30న (ఆదివారం) మాంసం, సీఫుడ్ విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్టు జీవీఎంసీ కమిషనర్ సృజన వెల్లడించారు.
మాంసం దుకాణాల వద్ద జనం గుమిగూడటంతో వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ప్రజలంతా సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. నగరంలో గత ఆదివారం కూడా మాంసం విక్రయాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: