విశాఖలోని రామకృష్ణాపురం శ్మశాన వాటికను జీవీఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలని, దహన కార్యక్రమాలు చేయటానికి అదనపు ఫ్లాట్ ఫాంలు వెంటనే నిర్మించాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్ మృతదేహాలకు అంత్యక్రియలు చేపట్టడం పట్ల కొందరు వ్యక్తులు అభ్యంతరం తెలిపినందున.. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
ఇదీ చదవండి: రఘురామ కేసు: సీఐడీ కోర్టు తీర్పుపై హైకోర్టులో ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్