ETV Bharat / city

MAOIST ARREST: మావోయిస్టు ఏరియా క‌మిటీ స‌భ్యుడు అరెస్ట్‌ - నేర వార్తలు

MAOIST ARREST: విశాఖ మన్యంలో మావోయిస్టు సభ్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతడిపై ఇప్పటి వరకు 70 కేసులున్నట్లు పోలీసులు వెల్లడించారు. అతని వద్ద నుంచి తుపాకితో పాటు పేలుడుకు వినియోగించే వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

MAOIST ARREST
MAOIST ARREST
author img

By

Published : Jan 9, 2022, 12:13 AM IST

MAOIST ARREST: విశాఖ మ‌న్యంలో మావోయిస్టు ఏరియా క‌మిటీ స‌భ్యుడిని సీలేరు పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని గూడెం కొత్త‌వీధి మండ‌లం సీలేరు పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని స‌ప్ప‌ర్ల కూడ‌లిలో.. పెద‌బ‌య‌లు ఏరియా క‌మిటీ సభ్యుడు కొర్రా సింగ్రు అలియాస్ సుంద‌ర‌రావును అరెస్టు చేశారు. ఒడిశాలోని మ‌ల్క‌న్‌గిరి జిల్లా చిత్ర‌కొండ బ్లాక్ పాలెం గ్రామానికి చెందిన సింగ్రూ.. 2000 సంవ‌త్స‌రంలో మావోయిస్టు పార్టీలో చేరాడు. గాలింపు చ‌ర్య‌ల‌ను నిర్వ‌హిస్తున్న పోలీసు బ‌ల‌గాల‌ను ల‌క్ష్యం చేసుకుని మందుపాత‌ర‌లు పేల్చ‌డానికి కొంత‌మంది మిలీషియా స‌భ్యుల‌తో వెళుతుండ‌గా, స‌ప్ప‌ర్ల కూడ‌లి వ‌ద్ద పోలీసుల‌కు చిక్కాడు. సింగ్రూ వ‌ద్ద నుంచి ఒక దేశ‌వాళీ తుపాకీ, బుల్లెట్లు, ఒక మందుపాత‌ర‌, రెండు డిటోనేట‌ర్లు, 60 మీట‌ర్ల కరెంటు వైరును స్వాధీనం చేసుకున్న‌ట్లు విశాఖ జిల్లా ఎస్పీ కృష్ణారావు తెలిపారు.

మావోయిస్టు సుంద‌ర‌రావుపై సుమారు 70 వరకు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇన్‌ఫార్మ‌ర్ల పేరిట జ‌రిగిన నాలుగు హ‌త్య‌ల‌్లో, రెండు మందుపాత‌ర‌లు పేల్చిన ఘ‌ట‌న‌ల్లో, 5 ఎదురుకాల్పులు సంఘ‌ట‌న‌ల్లో పాల్గొన్నాడని పోలీసులు వెల్లడించారు. మావోయిస్టులు, మిలీషియా స‌భ్యుల‌కు చెందిన స‌మాచారం త‌మ వ‌ద్ద ఉంద‌ని, వీరు స్వ‌చ్ఛందంగా లొంగిపోతే ప్ర‌భుత్వ ప‌రంగా స‌హాయాన్ని అందిస్తామ‌ని ఎస్పీ కృష్ణారావు తెలిపారు.

ఇదీ చదవండి: Constable Suspicious Death: కానిస్టేబుల్​ అనుమానాస్పద మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.