ETV Bharat / city

విశాఖలో అర్ధరాత్రి అలజడి... అసలేం జరిగిందంటే..?

సోమవారం రాత్రి 10.35 గంటల సమయం... ఆకాశాన కారుమబ్బులు కమ్ముకొస్తున్న వేళ... నగరం నిద్రలోకి జారుకుంటున్న సమయాన... ఒక్కసారిగా పేలుడు.. పరవాడ, లంకెలపాలెం, గాజువాక ప్రాంతాల్లోని వేలాదిమంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ఏదో జరిగిందంటూ కీడు శంకించారు.. అంతలోనే ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం సంభవించిందన్న సమాచారం తెలియడం, అదే సమయంలో భారీగా పొగ చొచ్చుకురావటంతో హడలెత్తిపోయారు...

author img

By

Published : Jul 14, 2020, 7:56 AM IST

Updated : Jul 14, 2020, 10:04 AM IST

major fire mishap at visakha
major fire mishap at visakha

ఫార్మాసిటీ చుట్టుపక్కల గ్రామాల్లో కన్ను పొడుచుకున్నా కానరానివిధంగా దట్టమైన పొగతో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. అక్కడున్న పరిశ్రమల్లోని ఉద్యోగులు, సిబ్బంది ప్రాణాలరచేతపట్టుకుని పరుగులు తీశారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక శకటాలు ముందుకెళ్లలేని పరిస్థితి. మరోవైపు దాదాపు 50 అడుగుల ఎత్తున ఎగసిపడుతున్న మంటలు.. మరోవైపు హైటెన్షన్‌ విద్యుత్తు వైరు తెగి పడిపోవటంతో అసలేం జరుగుతోందో తెలియక జనంలో ఆందోళన పెరిగిపోయింది.

  • ఏమిటీ పరిశ్రమ?

విశాఖ సాల్వెంట్స్‌ యాజమాన్యం విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉన్న ఫార్మా పరిశ్రమల నుంచి ఇథనాల్‌, హెచ్‌సీఎల్‌, ఎసిటోన్‌, ఎండీసీ, ఐపీఏ తదితర రసాయనాలను సేకరించి శుద్ధి చేసి.. హైద్రాబాద్‌, చెన్నైలకు పంపిస్తుంటుంది. వీటి శుద్ధి కోసం రియాక్టర్లు పని చేస్తుంటాయి.

*పరవాడ ఫార్మాసిటీలో సోమవారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మే నెల 7న ఎల్‌.జి.పాలిమర్స్‌లో జరిగిన స్టైరీన్‌ ప్రమాదాన్ని మరువక ముందే మరో భారీ అగ్నిప్రమాదం జరగడంతో ఏమవుతుందోనని సోమవారం అర్థరాత్రి దాటేవరకు ప్రాణాలరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కూర్చుకున్నారు. తాజాగా జూన్‌ 29వ తేదీ అర్ధరాత్రి ఫార్మాసిటీలోని సాయినార్‌ ఫార్మా సంస్థలో విషవాయువులు విడుదలై ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. వరుస సంఘటనలు జరుగుతుండడంతో పలువురు ఏక్షణంలో ఏమి జరుగుతుందోనన్న ఆందోళనతో టీవీల ముందే కూర్చొని జాగారం చేశారు. విశాఖ స్వాల్వెంట్స్‌ సంస్థలో జరిగిన ప్రమాదంలో ఏకంగా 50 అడుగుల వరకు అగ్నికీలలు ఎగసిపడడంతో అది ఇతర సంస్థలకు ఎక్కడ వ్యాప్తి చెందుతుందోనని పలువురు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదం కారణంగా భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు ఇతర సంస్థల్లోని రసాయనాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని భీతిల్లారు. ఒళ్లు గగుర్పొడిచే మంటలతోపాటు దట్టమైన పొగలు, వాసనలు కూడా ఫార్మాసిటీ పరిసర ప్రాంతాల వాసులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ప్రమాదం జరిగిన సమయంలో సంస్థలో పలు రకాల రసాయనాలున్నాయి. వాటిలో కొన్ని ప్రమాదకరమైనవి కాగా, మరికొన్ని సాధారణమైనవి. కొన్ని ప్రమాదకర రసాయనాలు అగ్నికి ఆహుతి కావడంతో అగ్నికీలల తీవ్రత పెరగడంతోపాటు గాఢమైన వాసనలు కూడా వచ్చాయి.

  • కారణమేమిటో....

ప్రమాదం జరగడానికి కారణం ఏమిటన్నది తెలియరాలేదు. భారీ శబ్దంతో పేలుడు సంభవించి మంటలు తలెత్తినట్లు పేర్కొంటున్నారు. సంఘటన స్థలంలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని నగరంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. మిగిలిన వారు ప్రమాదం ఎలా జరిగిందన్న విషయాన్ని చెప్పలేకపోతున్నారు. సంయుక్త కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి, ఆర్డీవో కిశోర్‌బాబు, ఏసీపీ రామాంజనేయులురెడ్డి తదితరులు సంఘటన స్థలానికి వచ్చి కారణాలను ఆరా తీస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ప్రత్యేక వాహనాన్ని తీసుకొచ్చి కాలుష్య కారక వాయువులు ఏమి విడుదలయ్యాయన్న అంశంపై పరిశీలిస్తున్నారు.

  • ఎంతకీ అదుపులోకి రాని మంటలు...

సరిగ్గా సోమవారం రాత్రి 10.35 గంటలకు విశాఖ సాల్వెంట్స్‌లో భారీ పేలుడు సంభవించింది. పెద్దఎత్తున చెలరేగిన మంటలు రాత్రి 1.50 గంటలకు సైతం అదుపులోకి రాలేదు. అతికష్టమ్మీద కొంతవరకు అదుపు చేసిన అగ్నిమాపక విభాగం ధైర్యం చేసి పరిశ్రమ లోపలికి వెళ్లగలిగింది.

  • తానాం గ్రామస్థుల ఆందోళన

ప్రమాదం జరిగిన ప్రాంతానికి కేవలం 400మీ దూరంలో తానాం గ్రామం ఉంది. గ్రామస్థులు నిద్రలోకి జారుకుంటున్న సమయంలో ఒక్కసారిగా బాంబు పేలిన శబ్ధం రావడంతో ఉలిక్కి పడి బయటకు పరుగులు తీశారు. రాంకీ ఫార్మా నుంచి భారీగా మంటలు ఎగసిపడుతుండటంతో ఆందోళన చెందారు. ఏమి చేయాలో తెలియక పిల్లాపాపలను తీసుకుని తలోదిక్కుకు పరుగులు తీశారు. పరవాడ ఫార్మా చరిత్రలోనే ఇది ఒక భారీ అగ్నిప్రమాదమని స్థానికులు చెబుతున్నారు.

  • ఎమ్మెల్యేకు నిరసన సెగలు...

పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ తన నియోజకవర్గ పరిధిలోని ఫార్మాసిటీలో ప్రమాదం సంభవించడంతో సోమవారం అర్ధరాత్రి సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంస్థను పరిశీలించి బయటకు వస్తున్న సమయంలో తానాం గ్రామస్థులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. రాంకీ డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వచ్చి ఆయన్ను అక్కడి నుంచి బయటకు పంపించాల్సి వచ్చింది. ప్రమాదం జరగడం దురదృష్టకరమని, దీనిపై న్యాయం జరిగేటట్లు చూస్తామన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ సంఘటన స్థలానికి వచ్చి నిరసన వ్యక్తం చేశారు.

  • సీఈటీపీ ప్రాంగణంలోనే...

ఫార్మాసిటీలోని రాంకీ సీఈటీపీలో ఉన్న సంస్థలో ప్రమాదం జరగడం చర్చనీయాంశంగా మారింది. సీఈటీపీ ప్రాంగణంలో విశాఖ సాల్వెంట్స్‌ సంస్థను ఎలా నిర్వహిస్తారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ప్రశ్నించారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని మండిపడ్డారు. భద్రత ప్రమాణాలు లోపించిన కారణంగానే ప్రమాదం సంభవించిందన్నారు.

  • కేసు నమోదు చేస్తాం

డీసీపీ సురేష్‌బాబు, పరవాడ సీఐ ఉదయ్‌కుమార్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు.

  • వారంతా సురక్షితమేనా?

విశాఖ సాల్వెంట్స్‌ పరిశ్రమలో ప్రమాదం సంభవించిన సమయానికి రెండో షిఫ్ట్‌లో దాదాపు 15 మంది సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. మంటలు చెలరేగగానే ఒకరు మినహా మిగిలినవారందరూ సురక్షితంగా బయటకు వచ్చేసినట్టు చెబుతున్నారు. వివిధ పరిశ్రమలకు అవసరమైన రసాయన ద్రావణాలను విశాఖ సాల్వెంట్స్‌ ఉత్పత్తి చేస్తుంది. నీటి శుద్ధి రసాయనాలు, ఫార్మా కంపెనీలకు అవసరమయ్యే ప్రాథమిక రసాయన ముడిపదార్థాలు, వివిధ ద్రావణాల ఉత్ప్రేరకాలు, బహళ వినియోగ రసాయనాలను ఇది తయారు చేస్తుంది. శానిటైజర్లను ఉత్పత్తి చేస్తోంది. 2010లో ఈ పరిశ్రమను ఏర్పాటు చేశారు. సుమారు 50 మంది వరకు విధులు నిర్వహిస్తున్నారు.

రియాక్టర్‌ వద్ద నమూనాలు సేకరిస్తుండగా వాల్వ్‌ నుంచి మంటలు వచ్చాయి. అవి ఎలా వచ్చాయన్నది సిబ్బందికి తెలియలేదు. ఆ మంటలు మల్లేశం అనే కార్మికుడిపైకి వచ్చాయి. మిగిలిన వారు అప్రమత్తమై తప్పించుకున్నారు. అయితే ఆ పేలుడు ఎలా సంభవించిందో ఇంతవరకు స్పష్టత రాలేదు. దీనిపై విచారణ చేస్తున్నాం. మిథనాల్‌ సాల్వెంట్‌ వల్లనే మంటలు వచ్చాయని అనుమానిస్తున్నాం. - క్రైమ్‌ డీసీపీ సురేష్‌బాబు

గ్రామస్థులతో మాట్లాడుతున్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి

సంఘటన ప్రాంతంలో గుమిగూడిన జనం

సంఘటనా స్థలం వద్ద ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ను అడ్డుకుంటున్న తానాం గ్రామస్థులు

దట్టంగా ఎగసిపడుతున్న పొగ

అందుబాటులో ఉంచిన అంబులెన్స్‌

పరిశ్రమలోకి వెళ్తున్న కాలుష్య నియంత్రణ మండలి వాహనం

పరవాడ ఊర చెరువు ప్రాంతం నుంచి తీసిన చిత్రం

ఇదీ చదవండి:

విశాఖ: ఫార్మాసిటీలో భారీ అగ్ని ప్రమాదం

Last Updated : Jul 14, 2020, 10:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.