వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి సమీపంలో.. అల్పపీడన ప్రాంతం ఏర్పడింది. రాగల 24 గంటల్లో ఇది మరింత బలపడి అల్పపీడనంగా మారుతుందని భారత వాతావరణ విభాగం తెలియ చేసింది. క్రమంగా వాయువ్య దిశగానే కదులుతూ ఒడిశాపై ఆవరిస్తుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం తో నైరుతి రుతుపవనాలు క్రియాశీలకంగా మారాయని.. మరిన్ని మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయని అంచనా వేసింది.
కోస్తాంధ్రలో వర్షాలు...
రుతుపవనాలతో పాటు అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలోని చాలా చోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాగల రెండురోజుల్లో ఉత్తర కోస్తాంధ్రలో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు. కోస్తాంధ్ర తీరం వెంబడి 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉన్న కారణంగా.. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఇదీ చదవండి: