ETV Bharat / city

'చెప్పులు, కోడిగుడ్లు ట్రైలర్ మాత్రమే.. బాంబులు, కత్తులూ వస్తాయ్' - వైజాగ్​లో చంద్రబాబు పర్యటన గురించి లోకేశ్ వ్యాఖ్యలు

చంద్రబాబునాయుడు రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో పర్యటించినప్పుడు లేని శాంతిభద్రతల సమస్య.. విశాఖకు వచ్చినప్పుడు మాత్రం ఎలా వస్తుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ప్రశ్నించారు. ప్రభుత్వం, పోలీసుల సహకారంతోనే వైకాపా కార్యకర్తలు చంద్రబాబు పర్యటనను అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు.

lokesh fires on ycp government
వైకాపా ప్రభుత్వంపై లోకేశ్ విమర్శలు
author img

By

Published : Feb 28, 2020, 10:13 AM IST

వైకాపా ప్రభుత్వంపై లోకేశ్ విమర్శలు

ప్రశాంతమైన విశాఖలో చెప్పులు, కోడిగుడ్లతో దాడులు ప్రారంభించిన వైకాపా.. బాంబులు, కత్తులు తీసుకొచ్చేందుకు కూడా ఎంతోకాలం పట్టదని తెదేపా నేత నారా లోకేశ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళనకారుల్లో అత్యాచారాల నిందితులు ఉండటం ఈ పరిస్థితికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు సహకరిస్తున్న పోలీసులందరి పేర్లూ రాసుకుంటున్నామని హెచ్చరించారు. విశాఖలో త్వరలోనే ప్రజాచైతన్య యాత్ర నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి.. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి భయానకం: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.