విశాఖ ఉక్కు వద్ద సుమారు రెండు లక్షల కోట్ల విలువైన భూములు ఉన్నాయని కార్మిక నేతలు చెప్తున్నారు. వీటిలో పోస్కో సంస్థకు 45 వేల కోట్ల విలువైన భూమి ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. దేశ ఆర్థిక ప్రగతికి దోహద పడుతున్న విశాఖ ఉక్కులో ప్రైవేట్ సంస్థల చొరబాటు ఎప్పటికైనా కర్మాగార ఉనికికి ముప్పు తెస్తుందని కార్మిక నాయకులు అందోళన చెందుతున్నారు. విశాఖ ఉక్కు ఎప్పుడు లాభాల బాటలోనే ఉంది. విశాఖ ఇనుము నాణ్యతలో ప్రపంచ స్థాయి విపణిలో సైతం అగ్రగామిగా నిలిచే ఉంది. గతంలో ఇదే తరహాలో విశాఖ ఉక్కు విస్తరణ పేరిట ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే ఆలోచన చేస్తే కార్మికలోకం సంఘటితం కావటంతో నిలిచింది. మళ్లీ ఇప్పుడు అదే తరహా పరిస్థితి పునరావృతమవుతుందని కార్మిక సంఘ నాయకులు అంటున్నారు.
ఇవీ చదవండి: విశాఖ స్టీల్ ప్లాంట్‌ని ప్రైవేటుపరం చేస్తే ఊరుకోం...!