Singeetam Srinivasa Rao: కొప్పరపు కవుల కళాపీఠం ఆధ్వర్యంలో సినీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు.. జాతీయ ప్రతిభా పురస్కారం ప్రదానం చేశారు. శుక్రవారం విశాఖ కళాభారతి ఆడిటోరియంలో.. అవధాన కవిబ్రహ్మోత్సవం పేరిట 20వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింగీతం శ్రీనివాసరావును జ్ఞాపికతో సత్కరించారు. పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు, ధూళిపాళ్ల మహాదేవమణికి గౌరవ సత్కారాలు చేశారు. సాహిత్యానికి అనుగుణంగా సంగీతం ఉంటుందని, సాహిత్యం మారితే స్వరం మారిపోతుందని శ్రీనివాసరావు అన్నారు.
ఐదో తరగతి వరకు పిల్లలకు మాతృ భాషలోనే విద్యాబోధన ఉండాలని గరికపాటి పేర్కొన్నారు. అధికార భాష సంఘ అధ్యక్షులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ.. కొప్పురపు కవులతో పాటు, తిరుపతి వెంకట కవులు విగ్రహాలను విశాఖలో ఏర్పాటు చేసామన్నారు. 20 ఏళ్ల నుంచి ఈ పురస్కరాలను అందిస్తున్నట్టు చెప్పారు. కరోన వల్ల రెండేళ్లుగా కార్యక్రమాన్ని నిర్వహించకపోవడం వల్ల ఈ ఏడాది ముగ్గురికి అవధాన పురస్కారలను అందిస్తున్నట్టు చెప్పారు. సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ తన చిత్రాలలో పాటల్లో సి నారాయణ రెడ్డి, శ్రీ శ్రీ, వేటూరి, సిరివెన్నెల సాహితీ ప్రముఖులతో బంధం ఉందని చెప్పారు. త్యాగరాజ స్వామి సంగీతం గురించి వివరించారు. తన మొట్ట మొదటి సినిమా నీతి నిజాయితీ లో సాలూరు రాజేశ్వరరావు పాటలు రాయించుకున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి: