ETV Bharat / city

విద్యారంగంలో ఒదిగే.. ఉన్నత శిఖరాలకు ఎదిగే - koneru krishnarao died

విద్యావేత్తగా ఎంతో గుర్తింపు సాధించి.. విద్యారంగానికి విశేష సేవలందించిన పద్మశ్రీ ఆచార్య కోనేరు రామకృష్ణరావు విశాఖలో కన్నుమూశారు. పలువురు ప్రముఖులు ఆయన భౌతిక కాయానికి నివాళి అర్పించారు.

koneru krishna rao passes away
koneru krishna rao passes away
author img

By

Published : Nov 10, 2021, 9:08 AM IST

విద్యారంగానికి విశేష సేవలందించిన పద్మశ్రీ ఆచార్య కోనేరు రామకృష్ణారావు(89) మంగళవారం విశాఖలో కన్నుమూశారు. పలువురు ప్రముఖులు ఆయన భౌతికకాయానికి నివాళి అర్పించారు. కృష్ణాజిల్లా ఎనికేపాడు గ్రామానికి చెందిన రామకృష్ణారావు ఎన్నో ఏళ్ల కిందటే విశాఖకు వచ్చారు. ఆంధ్రవిశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా జీవితం ప్రారంభించి మానసికశాస్త్రం, పారా సైకాలజీ విభాగాల్లో అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. విద్యావేత్తగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. ఇందుకు అహరహం శ్రమించారు. యోగా ప్రాధాన్యతను గుర్తించి 30 ఏళ్ల కిందటే ఆంధ్రవిశ్వవిద్యాలయంలో యోగా కాన్షియస్‌నెస్‌ విభాగాన్ని ప్రారంభించారు. గౌరవ డైరెక్టర్‌గా పదేళ్లపాటు కొనసాగారు. ‘కాగ్నిటివ్‌ ఎనామలీస్‌, కాన్షియస్‌నెస్‌ అండ్‌ యోగా’ పేరుతో వెయ్యి పేజీల పుస్తకాన్ని రచించారు. వివిధ శాస్త్రాలతో యోగాకు ఉన్న సంబంధంపై లోతైన అధ్యయనం చేశారు. అమెరికాలోని ‘పారా సైకలాజికల్‌ అసోషియేషన్‌’కు మూడుసార్లు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించిన ఏకైక ఆసియా వాసిగా గుర్తింపు పొందారు. ‘ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ అప్లైడ్‌ సైకాలజీ’కి అధ్యక్షుడిగా కూడా కొనసాగారు. అమెరికాలోని ‘ఫౌండేషన్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ ది నేచర్‌ ఆఫ్‌ మ్యాన్‌’ అనే సంస్థకు ఆరేళ్లపాటు సంచాలకుడిగా విధులు నిర్వర్తించారు. ‘ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ రీసెర్చ్‌’ సంస్థ జాతీయ ఫెలోగా కొనసాగారు.

ఆరోగ్యంపై దృష్టిసారించి: తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించి చూపారు. యోగా, ధ్యానంతో ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ ఎంతో చురుగ్గా ఉండేవారు. 87 ఏళ్ల వయస్సులోనూ వేగంగా ఉదయపు నడకకు వెళ్తూ, కొలనులో ఈత కొడుతూ ఆశ్చర్యపరచేవారు. ఆయన ముగ్గురు పిల్లలు రాణిరావు, వాణిరావు, శరత్‌చంద్రరావులు విదేశాల్లో స్థిరపడినప్పటికీ, విదేశాల్లో ఆయనకు పలు అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని కాదనుకుని విశాఖలోనే స్థిరపడ్డారు. రామకృష్ణారావు సతీమణి సరోజినీదేవి 2019లో మరణించారు. ఆమె మరణం ఆయన్ను బాగా కుంగదీసింది.

ప్రతిభకు తార్కాణాలెన్నో: 2006 నుంచి 2012 వరకు ‘ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఫిలసాఫికల్‌ రీసెర్చ్‌’ అధ్యక్షుడిగా, రెండుసార్లు గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయ కులపతిగా విధులు నిర్వర్తించారు. అమెరికాలోని డ్యూక్‌ విశ్వవిద్యాలయం, ‘యూనివర్సిటీ ఆఫ్‌ టెన్నెస్సీ’లలో కూడా కొంతకాలంపాటు ఆచార్యుడిగా కొనసాగారు. అమెరికాలో ‘యూనివర్సిటీ ఆఫ్‌ చికాగో’లో సైతం ఆయన పరిశోధన నిర్వహించారు. 20 పుస్తకాలతోపాటు వివిధ అంశాలపై దాదాపు 300 పరిశోధన పత్రాలను సమర్పించారు. అవన్నీ పలు జాతీయ, అంతర్జాతీయ జర్నళ్లలో ప్రచురితమయ్యాయి. రామకృష్ణారావు రాసిన కొన్ని పుస్తకాలు జపనీస్‌, జర్మన్‌, ఇటాలియన్‌, స్పానిష్‌... భాషల్లోకి కూడా అనువాదమయ్యాయి. ప్రతిష్ఠాత్మకమైన ఫుల్‌బ్రైట్‌, రాక్‌ఫెల్లర్‌ ఫౌండేషన్‌ ఫెలోషిప్‌లను కూడా సాధించారు. విద్యారంగానికి ఆయన అందించిన సేవలకు గానూ ఆంధ్రవిశ్వవిద్యాలయం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లను బహూకరించాయి. రాష్ట్రంలోని ఉన్నత విద్యారంగానికి దిశానిర్దేశం చేసే ‘రాష్ట్ర ఉన్నత విద్యామండలి’ని కూడా అప్పట్లో ఆచార్య కోనేరు రామకృష్ణరావు సిఫార్సుల ఆధారంగానే ఏర్పాటుచేశారు. 80 ఏళ్ల వయస్సు పైబడినా నాలుగు పుస్తకాలతో సహా సుమారు నాలుగువేల పేజీలు ప్రచురించడం గమనార్హం.

గాంధేయవాదం ఆయన ప్రాణం: మహాత్మాగాంధీ విధానాలు, గాంధేయవాదం, గాంధీ ప్రవచించిన అహింసా సిద్ధాంతాలు ప్రపంచ దేశాలన్నింటికీ అత్యంత ఉపయుక్తమని ఆయన విశ్వసించారు. ఏయూ ఆచార్యుడిగా విధులు నిర్వర్తిస్తున్నప్పుడు, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తరువాత కూడా ఆయన గాంధీజీ సిద్ధాంతాలపై అధ్యయనం చేశారు. ‘గాంధీస్‌ ధర్మ’ అనే ఒక పుస్తకాన్ని రాశారు. ‘ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌’ సంస్థ దాన్ని ప్రచురించి ప్రపంచంలోని పలుదేశాల్లో విక్రయించింది. ‘గాంధీ అండ్‌ అప్లైడ్‌ స్పిర్చ్యువాలిటీ’ అనే మరో పుస్తకాన్ని కూడా రచించారు. గాంధీజీ సిద్ధాంతాలను భావితరాలకు అందించే నిపుణులు కొందరైనా ఉండాలన్న ఉద్దేశంతో గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయ పూర్వ అధ్యక్షుడు ఎం.వి.వి.ఎస్‌.మూర్తిని ఒప్పించారు. ఫలితంగా గాంధియన్‌ ఎకనామిక్స్‌, గాంధియన్‌ ఫిలాసఫీ తదితర కోర్సులను ‘గీతం’లో అందుబాటులోకి తెచ్చారు. పాఠ్యాంశాల రూపకల్పన, విద్యాబోధన కూడా గాంధీజీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండేలా ఆయా కోర్సులను తీర్చిదిద్దారు.

ఇదీ చదవండి: roads:రూ.100 కోట్లు.. ఒక్క నెల ముచ్చటే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.